వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో జరిగిన చర్చల సందర్భంగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ‘తైవాన్ స్వతంత్రాన్ని’ అమెరికా ఖచ్చితంగా వ్యతిరేకించాలని మరియు తైవాన్ అంశాన్ని అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో కృత్రిమ మేధ రంగంలో చైనా-అమెరికాలు మరింతగా సహకరించుకోవాలని పిలుపునిచ్చారు.
చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం మూడు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా షీ జిన్‌పింగ్, ట్రంప్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఆరు నెలల వ్యవధిలో వీరిద్దరూ భేటీ అవ్వడం ఇది రెండోసారి.
దైపాక్షిక సంబంధాలలో వ్యూహాత్మక స్థిరత్వాన్ని పెంపొందించుకుంటూ, సహకారమే ప్రధాన ధ్యేయంగా, పోటీ సరైన పరిమితుల్లో ఉండేలా ముందుకు సాగాలని షీ జిన్‌పింగ్ పేర్కొన్నారు.ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు స్థిరంగా ఉండాలంటే సహకారాల జాబితాను పెంచి, వివాదాస్పద అంశాల జాబితాను తగ్గించాలని అభిప్రాయపడ్డారు.
Also Read:ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం..అప్‌డేట్స్
చైనా, అమెరికాలు రెండూ ఏఐ రంగంలో అత్యంత బలమైన సామర్థ్యం కలిగి ఉన్నాయని, పోటీ పడటంతో పాటు పరస్పర సహకారం కూడా అవసరమని తెలిపారు. ఏఐ సాంకేతికత ఎప్పుడూ మానవ నియంత్రణలోనే ఉండాలని, ప్రజల సంక్షేమం మరియు మానవాళి పురోగతికి ఉపయోగపడేలా ఇరు దేశాలు ఉమ్మడిగా పనిచేయాలని కోరారు.

