పాకిస్థాన్‌పై ప్రధాని మోదీ ధ్వజం

2
- Advertisement -

శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ (SRCC) విద్యా నైపుణ్యానికి, సంస్థాగత నిర్మాణానికి మరియు వ్యాపార, ప్రజా జీవితం, సమాజంలో ఎందరో నాయకులను తీర్చిదిద్దడంలో ఏళ్లుగా తన ప్రత్యేకతను చాటుకుందని ప్రధాని మోదీ అన్నారు. శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ (SRCC) శతాబ్ది వేడుకల్లో శనివారం ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించారు. ఈ వేడుకల్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ …శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ చరిత్రలో నేటి ఘట్టం ఎంతో ప్రత్యేకమైనది. దేశ విద్యా రంగానికి కూడా ఇది అంతే కీలకమైనది. SRCCలో భాగమైన పలు తరాల ప్రజలు ఇక్కడకు తరలివచ్చారు. SRCC శతాబ్ది వేడుకల సందర్భంగా మీ అందరికీ నా అభినందనలు అని అన్నారు.

నేడు ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేవారు ఆత్మరక్షణలో పడ్డారని, పాకిస్థాన్ గనుక ఏదైనా దుస్సాహసానికి ఒడిగడితే భారత సాయుధ దళాలు వారి భూభాగంలోకి వెళ్లి మరీ దాడి చేస్తాయని ప్రధాని మోదీ అన్నారు. జమ్మూ కాశ్మీర్ నుండి ఈశాన్య రాష్ట్రాల వరకు శాంతి పెరిగింది. మావోయిస్ట్ ఉగ్రవాదం, నక్సలిజం నడుము విరిగింది. ఒకప్పుడు భారతదేశ విధానపరమైన మందగమనం (పాలసీ పారాలిసిస్) గురించి ఆందోళన చెందిన ప్రపంచం, నేడు భారత్ పాలసీ డైనమిజం గురించి మాట్లాడుతోంది అని ఆయన తెలిపారు.

ప్రధాని మోదీ ఇంకా మాట్లాడుతూ…ఒక వ్యక్తి 100 సంవత్సరాలు జీవిస్తే, వారిని అనుభవాల నిధిగా భావిస్తారు. అదే ఒక సంస్థ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటే, అది విజయాలు, స్ఫూర్తికి నిలయంగా మారుతుంది. తన 100 ఏళ్ల ప్రయాణంలో SRCC ఎన్నో తరాలను తీర్చిదిద్దింది, వారిని ఉజ్వల భవిష్యత్తుతో అనుసంధానించింది. ఇక్కడకు వచ్చినవారు చదువుకున్నారు, ఇక్కడి నుండి వెళ్లినవారు ఉన్నతమైన వ్యక్తులుగా రూపుదిద్దుకున్నారు అని పేర్కొన్నారు.

ధురంధర్ కాకపోవచ్చు కానీ ధూమ్ ధామ్ చేశారు అని విక్రమ్ కాలేజ్ పూర్వ విద్యార్థుల గురించి మాట్లాడుతూ ప్రధాని వ్యాఖ్యానించారు. SRCC పూర్వ విద్యార్థులు ప్రతి రంగంలోనూ తమ ముద్ర వేశారని చెప్పారు.

Also Read:సైనా నెహ్వాల్..సరికొత్త ఛాలెంజ్

- Advertisement -