అమెరికా యుద్ధనౌకలపై ఇరాన్ దాడి

2
- Advertisement -

అమెరికాపై ఇరాన్ ప్రతీకార దాడులు కొనసాగాయి. ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఏరోస్పేస్ ఫోర్స్, అమెరికాకు చెందిన ఒక విమాన వాహక నౌక (ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్) మరియు ఒక డిస్ట్రాయర్‌పైకి పలు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు పేర్కొంది. ఆ రెండు యుద్ధనౌకలు ఇరాన్ నౌకలను వేధిస్తున్నాయని, తమ దేశంపై నౌకాదళ దిగ్బంధంలో (నవల్ బ్లాకేడ్) భాగమయ్యాయని IRGC ఆరోపించింది.

ఇరాన్ ప్రభుత్వ ప్రసార సంస్థ ఐఆర్ఐబి (IRIB) ద్వారా విడుదల చేసిన ప్రకటనలో, ఇరాన్ షిప్పింగ్‌పై శత్రుత్వ చర్యలు కొనసాగుతున్నందున రెండు అమెరికా నౌకాదళ నావలపై దాడులు చేసినట్లు IRGC తెలిపింది. ఇరాన్ నౌకలను వేధిస్తూ, నౌకాదళ దిగ్బంధంలో పాల్గొంటున్న అమెరికా సైన్యానికి చెందిన విమాన వాహక నౌక, డిస్ట్రాయర్‌లపై ఐఆర్‌జిసి ఏరోస్పేస్ ఫోర్స్ పలు బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది అని ఐఆర్ఐబి ప్రసారం చేసిన ప్రకటనలో ఉంది.

ఈ దాడుల్లో రెండు యుద్ధనౌకలు దెబ్బతినడంతో పాటు, మరో దాడి జరుగుతుందనే భయంతో ఘర్షణ ప్రాంతం నుండి పారిపోవాల్సి వచ్చిందని IRGC పేర్కొంది. ఆ రెండు యుద్ధనౌకలు దెబ్బతిని, మరొక దాడి జరుగుతుందనే భయంతో ఘర్షణ ప్రాంతం నుండి వెనక్కి తగ్గక తప్పలేదు అని తెలిపింది. ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లపై అమెరికా దాడులు, ఆ తర్వాత అమెరికాతో సంబంధమున్న నౌకలపై ఇరాన్ దాడుల నేపథ్యంలో ఈ ప్రాంతంలో మిలిటరీ ఉద్రిక్తతలు పెరిగాయి.

అంతకుముందు హోర్ముజ్ జలసంధిలోని ‘అనుమతి లేని మార్గం’ గుండా వెళ్తున్న మూడు ఆయిల్ ట్యాంకర్లతో పాటు, వివిధ ప్రాంతాలలో అమెరికాతో సంబంధం ఉన్న మరో మూడు నౌకలను లక్ష్యంగా చేసుకున్నట్లు IRGC నేవీ తెలిపింది. మూడు ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లపై అమెరికా జరిపిన దాడులకు నిరసనగా ఈ చర్య తీసుకున్నట్లు IRGC నేవీ పేర్కొంది. “హోర్ముజ్ జలసంధిని మూసివేసేందుకు అమెరికా సైన్యం క్రూరమైన, నిరాశాపూరిత చర్యకు ఒడిగట్టింది. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌కు చెందిన మూడు ఆయిల్ ట్యాంకర్లపై దాడి చేసి నష్టం కలిగించింది” అని ఐఆర్ఐబి ప్రసారం చేసిన ప్రకటనలో తెలిపింది.

హోర్ముజ్ జలసంధి పరిసరాల్లో పనిచేసే నౌకలు అనుమతి లేని జలమార్గాలను ఉపయోగించవద్దని ఇరాన్ దళాలు హెచ్చరించాయి. “అమెరికా సైన్యం మాటలు నమ్మి మోసపోకండి, అనుమతి లేని జలమార్గాలను దాటేందుకు ఎలాంటి అనుమానాస్పద యత్నాలు చేయవద్దు. లేకపోతే దాడులు ఎదుర్కోవాల్సి వస్తుంది” అని హెచ్చరించింది.

Also Read:సైనా నెహ్వాల్..సరికొత్త ఛాలెంజ్

- Advertisement -