పంజాబ్ SIR…రాఘవ్ చద్దా ఫైర్

1
- Advertisement -

రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పంజాబ్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ముసాయిదాపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. డ్రాఫ్ట్ రోల్‌లో తన పేరును తొలగించడమే కాకుండా తనను “మాజీ ఎంపీ” అని తప్పుగా పేర్కొనడంపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇది కేవలం సాంకేతిక లోపం కాదని పొరపాటున జరిగింది కాదని, కావాలని తనను మానసికంగా వేధించడానికి మరియు రాజకీయ కుట్రలో భాగంగా చేసిన చర్య అని ఆయన ఆరోపించారు.

తాను ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నప్పటికీ, ఓటర్ల ముసాయిదా జాబితాలో తన పేరు ముందు “మాజీ ఎంపీ” అని చేర్చడం దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆయన అన్నారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా లేదా విచారణ జరపకుండా తన పేరును ముసాయిదా ఓటర్ల జాబితా నుండి తొలగించడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని స్పష్టం చేశారు.

ప్రత్యర్థులు తనపై రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఈ రకమైన చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన రాఘవ్ చద్దా…వెంటనే ఎన్నికల సంఘం (ECI) అధికారులను కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ సాంకేతిక లేదా మానవ తప్పిదానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అలాగే ముసాయిదా జాబితాలో తన వివరాలను వెంటనే సరిదిద్ది, ఓటరు హక్కును పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు.

Also Read:బోడ కాకరకాయ..ప్రయోజనాలు!

మరోవైపు, ఈ అంశంపై ఎన్నికల అధికారులు స్పందిస్తూ ఇది పరిశీలనలో ఉన్న ముసాయిదా (Draft) మాత్రమేనని, ఏవైనా తప్పులు లేదా అభ్యంతరాలు ఉంటే సరిదిద్దడానికి అవకాశం ఉంటుందని, సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

- Advertisement -