వర్షాకాలంలో మాత్రమే మార్కెట్లలో కనిపించే ప్రత్యేకమైన కూరగాయల్లో ఆకాకరకాయ (దీనిని హిందీలో ‘కంకోడ’ లేదా ‘కాంటోలా’, ఇంగ్లీష్‌లో ‘Spiny Gourd’ అని పిలుస్తారు) ఒకటి. పైకి చిన్న ముళ్ల వంటి నిర్మాణంతో, కాకరకాయ పోలికలతో ఉండే ఈ కూరగాయ చేదుగా ఉండకపోవడమే కాకుండా పోషకాల గనిగా పనిచేస్తుంది. దీనివల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..
బ్లడ్ షుగర్ కంట్రోల్ (డయాబెటిస్ నియంత్రణ)..బోడకాకరకాయలో ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్సులిన్ శోషణను మెరుగుపరిచి, భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా నిరోధిస్తాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఇది ఒక మంచి ఆహారం.
చర్మ సౌందర్యానికి మేలు..విటమిన్ ఏ, విటమిన్ సీ మరియు యాంటీఆక్సిడెంట్లు ఇందులో సమృద్ధిగా ఉండటం వల్ల చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది చర్మ కణాల పునరుత్పత్తికి సహాయపడి, పింపుల్స్ తగ్గించడమే కాకుండా చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది.
బరువు తగ్గడానికి ఉత్తమం..ఆకాకరకాయలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. నీటి శాతం, ఫైబర్ ఎక్కువ కావడం వల్ల దీనిని తిన్న తర్వాత కడుపు నిండిన భావన కలుగుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక పర్ఫెక్ట్ వెజిటబుల్ డైట్ అని చెప్పవచ్చు.
జీర్ణవ్యవస్థ మెరుగుదల..ఇందులో ఉండే కరిగే మరియు కరగని ఫైబర్ జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. మలబద్ధకం, కడుపు ఉబ్బరం మరియు గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనాన్ని అందించి, పేగులలో మంచి బాక్టీరియా వృద్ధి చెందడానికి తోడ్పడుతుంది.
Also Read:ఇరాన్‌తో చర్చలు లేవు:ట్రంప్
రోగనిరోధక శక్తి ..వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సీజనల్ ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని కాపాడడంలో ఆకాకరకాయ బాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సీ, ఫ్లేవనాయిడ్లు శరీరానికి అవసరమైన రోగనిరోధక శక్తిని అందిస్తాయి.

