ఇంగ్లీష్, కామర్స్ మరియు సోషియాలజీ సబ్జెక్టుల యూజీసీ-నెట్ (UGC-NET) పరీక్షలను మళ్లీ నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సోమవారం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి మోదీ జీ, మీ NTA ఏం చేసిందో చూడండి అని ఆయన మండిపడ్డారు. తప్పులతో కూడిన ప్రశ్నపత్రాలను తయారు చేయడం, పాత ప్రశ్నలను యథాతథంగా పునరావృతం చేయడం వల్ల వేలాది మంది అభ్యర్థులు సెప్టెంబర్‌లో మళ్లీ పరీక్ష రాయాల్సి వస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎక్స్‌లో చేసిన పోస్ట్‌లో రాహుల్ గాంధీ స్పందిస్తూ.. సోషియాలజీ, ఇంగ్లీష్ మరియు కామర్స్ సబ్జెక్టుల UGC-NET పరీక్షలు జూన్ 22 నుండి 30 మధ్య జరిగాయి. దాదాపు రెండు నెలల తర్వాత, తప్పులతో కూడిన పేపర్లు ఇవ్వడం మరియు పాత ప్రశ్నలను పునరావృతం చేసిన కారణంగా NTA ఈ మూడింటినీ రద్దు చేసింది అని తెలిపారు. ఏళ్ల తరబడి కష్టపడి సిద్ధమైన వేలాది మంది అభ్యర్థులు ఇప్పుడు ఈ ప్రక్రియను మళ్లీ పూర్తి చేయాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఏళ్ల తరబడి శ్రమించి, ఫీజులు చెల్లించి, సుదూర ప్రాంతాల్లోని కేంద్రాలకు వెళ్లిన వేలాది మంది అభ్యర్థులు ఇప్పుడు సెప్టెంబర్‌లో ఇదంతా మళ్లీ చేయాల్సి వస్తోంది. తప్పు NTA చేస్తుంది, కానీ శిక్ష మాత్రం విద్యార్థులు అనుభవిస్తున్నారు అని రాహుల్ గాంధీ అన్నారు. ప్రస్తుత పరీక్షల వ్యవస్థ ఒక డబ్బు లాగే యంత్రం లాగా మారిందని కాంగ్రెస్ నేత ఆరోపించారు. ఇది విద్యార్థుల డబ్బును, సమయాన్ని, మానసిక ప్రశాంతతను మరియు ఆత్మవిశ్వాసాన్ని లాక్కుంటుంది తప్ప ఎలాంటి ఫలితాన్ని, చివరికి ఉద్యోగాన్ని కూడా ఇవ్వలేకపోతోందని పేర్కొన్నారు.
నేను ఇదే విషయాన్ని కోటాలో, డెహ్రాడూన్‌లో, ప్రయాగ్‌రాజ్‌లో చెప్పాను.. ఇప్పుడు కూడా చెప్తూనే ఉంటాను. ఇది ఇకపై విద్యా వ్యవస్థ ఎంతమాత్రమూ కాదు. ఇదొక మనీ ఎక్స్‌ట్రాక్షన్ మెషిన్. NTA ఇప్పటికీ అసలైన ప్రశ్నకు సమాధానం ఇవ్వదు – పరీక్షకు ముందే ఈ పేపర్లు లీక్ అయ్యాయా? మోదీ ప్రభుత్వంలోని ప్రతి విభాగంలాగే, ఎన్‌టీఏ కూడా తమది తప్పని ఎప్పటికీ అంగీకరించదు అని అన్నారు.
Also Read:యాంకర్ అనుసూయకు బిగ్‌షాక్
ఎన్‌టీఏ నాయకత్వాన్ని జవాబుదారీ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది మొదటి అడుగు మాత్రమే చివరిది కాదు. NTA నాయకత్వంపై కూడా చర్యలు తీసుకోలు తీర్చాలి. సెప్టెంబర్‌లో మళ్లీ ఈ పరీక్ష రాయబోతున్న ప్రతి విద్యార్థికి నేను చెప్పేది ఒకటే – లోపం మీలో లేదు. ఒక పరీక్షను కూడా సరిగ్గా నిర్వహించలేని వ్యవస్థను ప్రధాని మోదీ నిర్మించారు, ఆపై పరీక్ష రాసే విద్యార్థులపై నిందలు వేస్తున్నారు. మీ విలువైన సంవత్సరాలు దోచుకోబడుతున్నాయి. మోదీ దీనికి సమాధానం చెప్పేంత వరకు మేము పోరాటం ఆపము అని రాహుల్ గాంధీ జోడించారు.

