UGC NETలో తప్పులు..మళ్లీ పరీక్ష

2
- Advertisement -

యూజీసీ నెట్ (UGC NET) రాసిన అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) బిగ్ షాక్ ఇచ్చింది. నిర్వహించిన పరీక్షల్లో తీవ్రమైన తప్పులు, ముద్రణ లోపాలు, మరియు అనువాద సమస్యలు దొర్లడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక నిర్ణయం తీసుకుంది. అభ్యర్థుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, సాంకేతిక లోపాలను పరిగణనలోకి తీసుకున్న ఎన్‌టీఏ.. ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టుల పరీక్షలను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

పరీక్ష ప్రశ్నపత్రాల్లో దొర్లిన తప్పుల వల్ల అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉండటంతో, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ మూడు సబ్జెక్టులకు మళ్లీ పరీక్ష నిర్వహించాలని NTA నిర్ణయించింది.

సెప్టెంబర్ 9 మరియు 10 తేదీల్లో ఈ మూడు సబ్జెక్టులకు తిరిగి పరీక్షలు నిర్వహించనున్నారు. రద్దయిన సబ్జెక్టుల అభ్యర్థులకు కొత్త హాల్ టికెట్లను (Admit Cards) త్వరలోనే అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.

Also Read:సౌదీ-టర్కీ-పాక్ రక్షణ ఒప్పందంపై ట్రంప్

పరీక్షల్లో పదే పదే సాంకేతిక మరియు అనువాద లోపాలు తలెత్తడంపై అభ్యర్థులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. నెలల తరబడి కష్టపడి చదివిన తమకు ఎన్‌టీఏ నిర్లక్ష్యం వల్ల మళ్లీ పరీక్ష రాయాల్సి రావడం మానసిక ఒత్తిడికి గురిచేస్తోందని ఆవేదన చెందుతున్నారు. ఇకపై జరిగే పరీక్షలనైనా ఎటువంటి లోపాలు లేకుండా, పారదర్శకంగా నిర్వహించాలని అభ్యర్థులు కోరుతున్నారు.

- Advertisement -