యాంకర్ అనుసూయకు బిగ్‌షాక్

1
- Advertisement -

ప్రముఖ యాంకర్ మరియు నటి అనసూయ భరద్వాజ్‌కు ఊహించని షాక్ తగిలింది. హిందూ మతం మరియు ధర్మంపై ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అనసూయ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయంటూ భారతీయ జనతా పార్టీ (BJP) నాయకులు హైదరాబాద్‌లోని బోరబండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

బోరబండ పిఎస్‌లో ఫిర్యాదు చేసిన బీజేపీ నాయకులు, అనసూయపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. “జై శ్రీరామ్” అనే పవిత్ర నినాదం ముసుగులో కొందరు దాడులకు పాల్పడుతున్నారంటూ అనసూయ చేసిన సంచలన వ్యాఖ్యలు సమాజంలో అలజడి సృష్టిస్తున్నాయని వారు ఆరోపించారు. ఒక బాధ్యతాయుతమైన హోదాలో ఉండి సోషల్ మీడియా వేదికగా మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడాలని లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వారు హెచ్చరించారు.

గతంలో కూడా పలు విషయాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన అనసూయ, ఈసారి ఏకంగా మతపరమైన అంశాన్ని ప్రస్తావించడంతో వివాదం మరింత ముదిరింది. పవిత్రమైన జై శ్రీరామ్ నినాదాన్ని దాడులతో ముడిపెట్టడం సరికాదని భక్తులు మరియు హిందూ సంఘాల నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Also Read:సౌదీ-టర్కీ-పాక్ రక్షణ ఒప్పందంపై ట్రంప్

- Advertisement -