కొద్దిరోజులుగా వార్తల్లో కనిపించకుండా సైలెంట్‌గా ఉన్న నటి రష్మిక మందన్నా ట్టకేలకు తను పనికి దూరంగా ఉండటానికి కారణమైన గాయం గురించి నోరు విప్పారు. తన రాబోయే పాన్-ఇండియా యాక్షన్ డ్రామా ‘మైసా’ షూటింగ్లో తీవ్రంగా గాయపడి కోలుకుంటున్నట్లు వెల్లడించారు.
తన గాయం గురించి అనేక కథనాలు వచ్చినప్పటికీ, మొదట ఈ విషయాన్ని రహస్యంగానే ఉంచాలని భావించినట్లు రష్మిక అంగీకరించారు. అంతేకాకుండా ఇది ఒకేసారి జరిగిన సంఘటన కాదని వరుసగా జరిగిన మూడో గాయమని ఆమె తెలిపారు. ఇది జరిగి కొద్దిరోజులైంది..ఇది నాకు వరుసగా జరిగిన మూడో గాయం.. నా శరీరాన్ని యంత్రంలా కాకుండా మనిషి శరీరంగా భావించి జాగ్రత్తగా చూసుకోవడం ఇకనైనా నేర్చుకోవాలి అని రాసుకొచ్చారు.
గాయం తీవ్రతను అభిమానులకు వివరిస్తూ ముందుగా బయోలజీ టీచర్‌కి దారి ఇవ్వండి అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. మన తుంటికి ఇరువైపులా కాలును, తుంటి భాగంతో అనుసంధానించే 4 టెండన్లు (కండరాలను ఎముకలతో కలిపే కణజాలం) ఉంటాయి. నా కుడి తుంటిలోని ఒక టెండన్ తెగి ఊడిపోయింది. నా కాలును పైకి లేపడానికి, ఇతర కదలికలు చేయడానికి ఆ టెండన్ మళ్లీ సరిగ్గా అతుక్కోవాల్సి ఉంది అని చెప్పారు.
Also Read:బడికి వెళ్లాలంటే ప్రాణాలు పణంగా పెట్టాలా!
‘మైసా’ చిత్రం కోసం డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని, తన కెరీర్లోనే ఇది అత్యంత శారీరక శ్రమతో కూడుకున్న కఠినమైన చిత్రమని ఆమె చెప్పారు.మైసా డ్యాన్స్ షూట్ సమయంలో ఇది జరిగింది.. నా దేవుడా, ఇప్పటివరకు నేను చేసిన చిత్రాలలో ఇదే అత్యంత అగ్రెసివ్ చిత్రం అని పేర్కొన్నారు.

