ఖతార్, సౌదీ అరేబియా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వంటి గల్ఫ్ మిత్రదేశాల విజ్ఞప్తి మేరకు ఇరాన్‌పై కొత్త దాడులు జరపాలని అమెరికా దళాలను ఆదేశించకుండా తాత్కాలికంగా నిలిపివేసినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఇరాన్‌తో సంప్రదింపుల మార్గాలు తెరిచే ఉన్నాయని ఆయన ధృవీకరించారు. మేము వారితో (ఇరానీయులతో) చర్చల రూపంలో మాట్లాడుతున్నాం… ఇది సోమవారం మధ్యాహ్నం ప్రారంభమవుతుంది ఫలితం ఎలా ఉంటుందో చూద్దాం అని ట్రంప్ పేర్కొన్నారు. అలాగే నేను మనుషులను చంపాలని అనుకోవడం లేదు ఎందుకంటే చాలా మంది ప్రాణాలు కోల్పోతారు…అది నాకు ఎంతమాత్రం ఇష్టం లేదు అని ఆయన వ్యాఖ్యానించారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఖతార్, సౌదీ అరేబియా, UAE వంటి గల్ఫ్ మిత్రదేశాల కోరిక మేరకు ఇరాన్‌పై మరిన్ని దాడులు చేయకుండా తన దళాలను ట్రంప్ నిలిపివేశారు. అమెరికా దళాలు… ఇరాన్‌పై పెద్ద ఎత్తున మరొక దాడి చేయడానికి సిద్ధంగా ఒక ప్రణాళిక ఉందని ఆయన వెల్లడించారు. అయితే సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌తో సహా పలువురు గల్ఫ్ నాయకుల విజ్ఞప్తి అలాగే పేరు చెప్పడానికి ఇష్టపడని కొందరు ఇరాన్ అధికారుల కోరిక మేరకు దౌత్యానికి మరింత సమయం ఇవ్వాలని నిర్ణయించుకుని ఆ దాడి ప్రణాళికను వాయిదా వేసినట్లు తెలిపారు.
Also Read:తెలంగాణ అంటే తాగుడు కాదు!
సౌదీ యువరాజుతో జరిగిన సంభాషణను ప్రస్తావిస్తూ.. నేను క్రౌన్ ప్రిన్స్‌ను అడిగాను మనం ఈ దాడి చేయడం మీకు ఇష్టమా లేదా నా? అని ట్రంప్ తెలిపారు. శనివారం రోజున ట్రంప్ మరియు సౌదీ యువరాజుల మధ్య ఈ చర్చలు జరిగాయి. ఆ తర్వాత ఐదు నెలలుగా సాగుతున్న ఈ యుద్ధాన్ని ముగించడానికి మధ్యప్రాచ్య మిత్రదేశాలు ఒక ఒప్పంద పరిధికి చేరుకున్నాయని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

