తెలుగు నేలపై ఒక్కో ప్రాంతానికి ఒక్కో విశిష్టమైన సంస్కృతి, జీవన విధానం ఉన్నాయి. సరిహద్దులు విడిపోయినా, మనం తీసేవి, చూసేవి అన్నీ తెలుగు సినిమాలేనని, వినోద రంగాన్ని ప్రాంతాల వారీగా విడదీసి చూడటం సరికాదని చిత్రసీమకు చెందిన పలువురు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల ‘ఇడుపు కాయితం’ సినిమా విషయంలో జరిగిన వివాదం, దానిపై వ్యక్తమైన ఆవేదన ఈ అంశాన్ని మరొకసారి చర్చనీయాంశంగా మార్చింది.
ఏ ప్రాంతపు కల్చర్ దానిదే. తెలంగాణ సంస్కృతిని కేవలం ‘తాగుడు’కే పరిమితం చేయడం లేదా ఆంధ్రా అనగానే కేవలం ‘భోజనం’ మాత్రమే గుర్తొస్తుందనుకోవడం సమాజంలో పెరిగిపోయిన అపోహ మాత్రమే అన్నారు నటుడు నరేష్. ‘ఇడుపు కాయితం’ సినిమా వివాదంపై కొందరు స్పందిస్తూ.. “ఒక్కో ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన కల్చర్ ఉంటుంది. మనమందరం నిర్మించేది తెలుగు సినిమాలే అయినప్పుడు ఈ తరహా విభేదాలు సృష్టించడం ఎంతమాత్రం తగదు. ఈ వివాదాన్ని చూసి ఎంతో బాధేసింది” అని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు అక్కడ కనిపించే ఆతిథ్యం, ఆచారాలు, కట్టుబొట్టు ఎంతో ముచ్చటగొలుపుతాయి. ముఖ్యంగా మనుషుల మధ్య ఉండే బంధాలకు, సాంప్రదాయాలకు ఇక్కడ ఇచ్చే ప్రాధాన్యత ఎంతో గొప్పది. ఉదాహరణకు, ఎవరైనా చనిపోయిన తర్వాత “మూడో రోజు” (చిన్న దినం/చిన్నకర్మ) నిర్వహించే కార్యక్రమాల్లో పాటించే ఆచారాలు, కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులు ఒకరికొకరు తోడుగా నిలిచే తీరు తెలంగాణ సంస్కృతిలోని మానవీయ కోణాన్ని, దాని గొప్పదనాన్ని ఎలుగెత్తి చాటుతాయి.
Also Read:‘ది ప్యారడైజ్’..టీజర్ అప్‌డేట్
కళలు, సినిమాలు అనేవి ప్రజలను మనుషులతో మనుషులను జోడించే వారధులుగా ఉండాలి తప్ప, వివాదాలకు వేదికలు కాకూడదు. ప్రతీ ప్రాంతపు సంస్కృతి, మాండలికాలను గౌరవిస్తూ వినోదాన్ని ఆస్వాదించినప్పుడే తెలుగు సినిమా సరిహద్దులు దాటి మరింతగా శోభిస్తుంది.

