గ్లాస్గోలోని ‘OVO హైడ్రో’ వేదికగా 23వ కామన్వెల్త్ గేమ్స్ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. . 11 రోజుల పాటు సాగిన 2026 కామన్వెల్త్ క్రీడలు ఘనంగా ముగిశాయి. స్కాట్లాండ్ అధికారికంగా కామన్వెల్త్ గేమ్స్ ఫ్లాగ్ మరియు సాంప్రదాయ బ్యాటన్‌ను భారత్‌కు అందజేసింది. 2030లో జరగబోయే చారిత్రాత్మక శతాబ్ది (100వ సంవత్సరపు) ఎడిషన్‌కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది.
కింగ్ చార్లెస్ III ప్రతినిధిగా హాజరైన ఎడిన్‌బరో డ్యూక్ ప్రిన్స్ ఎడ్వర్డ్, క్రీడలు అధికారికంగా ముగిసినట్లు ప్రకటించారు. మీరు పోటీ పడిన, నిర్వహించిన, మద్దతుగా నిలిచిన తీరుకు ధన్యవాదాలు. మీరు ఈ రాత్రి కామన్వెల్త్ యొక్క స్ఫూర్తిని, విలువలను మరోసారి చాటిచెప్పారు. ధన్యవాదాలు, గ్లాస్గో అన్నారు. వచ్చే నాలుగు సంవత్సరాల తర్వాత, శతాబ్ది వేడుకగా జరగబోయే 24వ కామన్వెల్త్ క్రీడలను జరుపుకోవడానికి భారతదేశంలోని అహ్మదాబాద్‌కు రావాలని అన్ని దేశాలు, ప్రాంతాల అథ్లెట్లను ఆహ్వానిస్తున్నాను అని ఆయన జోడించారు.
మహిళల 57 కేజీల బాక్సింగ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన జైస్మిన్ లాంబోరియా ముగింపు వేడుకల్లో భారత పతాకధారిగా వ్యవహరించారు. ఈ సారి భారత్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. మొత్తం 39 పతకాలు (13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలు) సాధించి పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది.
Also Read:తెలంగాణ అంటే తాగుడు కాదు!

