ఈ ఏడాది భారీ వర్షాలు:రంగంలో స్వర్ణలత

5
- Advertisement -

సికింద్రాబాద్ లష్కర్‌ బోనాల్లో భాగంగా అమ్మవారు రంగం వినిపించారు మాతంగి స్వర్ణలత. తాను ఈ సారి క్రోదంతో వచ్చానని అమ్మవారు తెలిపారు. మీతోని ఎందుకు మాట్లాడాలి..ఎందుకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. మీరు మా వినరు, ఆచరించరు అందుకే ఎందుకు సమాధానం చెప్పాలన్నారు.

ప్రజలకు ఏ ఆపద వచ్చినా కాపాడుతున్న కానీ తన మాటను ఆచరించడం లేదన్నారు. అందుకే తాను ఆగ్రహంతో ఉన్నానని తెలిపారు స్వర్ణలత. గత ఏడాది చెప్పినట్లు ఈ ఏడాది కుంభ వర్షాలు ఉన్నాయని తెలిపింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వర్షాలతో కొట్టుకుపోయే ప్రమాదం ఉందని తెలిపారు.

ఈ ఏడాది ప్రాణ నష్టం ఎక్కువగా ఉందని.. పాపాలు చేసే వారిని వదిలిపెట్టనని హెచ్చరించారు.పిల్లలను తల్లిదండ్రులు రోడ్డు మీదకు వదిలేసి అనేక అనార్థలు జరుగుతున్నాయని తెలిపింది. ;ప్రజలు చేస్తున్న తప్పులను చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని తెలిపింది. తనవిగ్రహ ప్రతిష్ట చేస్తే కోరిందల్ల బంగారం అవుతుందని చెప్పారు. బోనాల సందర్భంగా అమ్మవారి దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు.

Also Read:తెలంగాణ అంటే తాగుడు కాదు!

- Advertisement -