‘ప్రధాన్’ను తీసేసి ‘ప్రధాని’ని కాపాడుకున్నారు!

3
- Advertisement -

లోక్‌సభలో పేపర్ లీక్ వ్యతిరేక సవరణ బిల్లుపై జరుగుతున్న చర్చలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. “ప్రధాన మంత్రిని కాపాడుకోవడానికే ప్రభుత్వం ‘ప్రధాన్’ (విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్)ను తొలగించింది అని వ్యాఖ్యానించారు. నీట్ పేపర్ లీక్‌పై దేశ రాజధానిలో విద్యార్థులు చేపట్టిన నిరసనలపై ఎస్పీ అధ్యక్షుడు మాట్లాడుతూ… ప్రభుత్వం తలవంచుతుంది కానీ దాన్ని తలవంచేలా చేసే వ్యక్తి కావాలి అని అన్నారు.

మోదీ ప్రభుత్వ హయాంలో జరిగిన పేపర్ లీకేజీలపై అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ… చట్టం సమర్థవంతంగా పనిచేసి ఉంటే భాజపా పదేళ్ల పాలనలో 20 పరీక్షల పేపర్లు ఎలా లీక్ అయ్యాయి?” అని ప్రశ్నించారు. అలాగే “దొంగతనాన్ని అడ్డుకోవడంలో విఫలమైన వారిని ఎలా నమ్మగలం? ఈ కొత్త బిల్లు కేవలం ఉన్న చట్టానికి సవరణ మాత్రమే. మీరు ఎవరిని అమాయకులను చేయాలని చూస్తున్నారు? అని ప్రశ్నించారు.

యూనియన్ మంత్రి కిరణ్ రిజిజు “ఎమర్జెన్సీ” కాలం గురించి మరియు నిరసనలను అణచివేసిన తీరు గురించి లేవనెత్తగా…ఎస్పీ అధ్యక్షుడు స్పందిస్తూ… నేను ఎమర్జెన్సీని చూడలేదు కానీ ఇక్కడే దేశ రాజధానిలో ఏం జరిగిందో ప్రత్యక్షంగా చూశాను. విద్యార్థుల ఆందోళనను అణచివేయడానికి ప్రభుత్వం టియర్ గ్యాస్ షెల్స్, మేకులున్న లాఠీలు మరియు ఇతర ఆయుధాలను ఉపయోగించింది అని ఆరోపించారు.

Also Read:కొరియన్ కనకరాజు..నవ్వుతూనే ఉంటారు!

- Advertisement -