గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ తన అద్భుత ప్రదర్శన కొనసాగిస్తోంది. 6వ రోజు భారత్‌కు రెండు పతకాలను సాధించింది. అథ్లెట్ గుల్వీర్ సింగ్, వెయిట్‌లిఫ్టర్ హర్జిందర్ కౌర్ లు రజత పతకాలను సాధించారు. బాక్సర్లు సెమీఫైనల్స్‌కు చేరుకోవడంతో భారత బాక్సింగ్ విభాగంలో కనీసం మూడు పతకాలు ఖాయమయ్యాయి.
కొన్ని ఈవెంట్లు నిరాశ పరిచినప్పటి భారత అథ్లెట్లు అవసరమైన సమయంలో అద్భుత ప్రదర్శన చేశారు. ఈ తాజా పతకాలతో దేశం మొత్తం పతకాల సంఖ్య 12కు చేరింది, దీనితో కామన్వెల్త్ గేమ్స్ పతకాల పట్టికలో భారత్ 9వ స్థానానికి ఎగబాకింది. భారత వెయిట్‌లిఫ్టర్ హర్జిందర్ కౌర్ మహిళల 69 కేజీల విభాగంలో అద్భుత ప్రదర్శన కనబరిచి మొత్తం 227 కేజీల బరువును ఎత్తి రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు.
Also Read:‘ప్రధాన్’ను తీసేసి ‘ప్రధాని’ని కాపాడుకున్నారు!
పురుషుల 10,000 మీటర్ల ఫైనల్లో రజత పతకం గెలుచుకోవడం ద్వారా భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్ తన పేరును చరిత్ర పుటల్లో లిఖించారు. ఇండియన్ ఆర్మీలో నాయిబ్ సుబేదార్‌గా విధులు నిర్వర్తిస్తున్న 27 ఏళ్ల గుల్వీర్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ రేసుల్లో ఒకదాన్ని ప్రదర్శించారు.
ఇప్పటివరకు భారత బృందం సాధించిన పతకాలు స్వర్ణం 2,రజతం 7,కాంస్యం 3 పతకాలు ఉన్నాయి.

