NEET పేపర్ లీక్‌..సీబీఐ క్లీన్ చిట్

2
- Advertisement -

దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన NEET (UG) ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా, కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న సంజీవ్ కుమార్ అలియాస్ సంజీవ్ ముఖియాకు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది.

2024లో బీహార్ కేంద్రంగా NEET ప్రశ్నపత్రాలను దొంగిలించి, వాటిని అక్రమంగా పంపిణీ చేయడంలో సంజీవ్ ముఖియా హస్తం ఉందంటూ సీబీఐ గతంలో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల సమర్పించిన దర్యాప్తు నివేదికలో ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించలేదని దర్యాప్తు సంస్థ స్పష్టం చేసింది.

ఈ లీకేజీ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న మరో 45 మంది నిందితులపై సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ కుట్రలో భాగస్వాములైన వారందరినీ గుర్తించామని తెలిపిన అధికారులు, ప్రాథమికంగా ప్రధాన నిందితుడిగా భావించిన సంజీవ్ ముఖియాపై మాత్రం ఎలాంటి ప్రత్యక్ష లేదా పరోక్ష సాక్ష్యాలు దొరకలేదని కోర్టుకు తెలిపినట్లు సమాచారం. దీంతో ఈ కేసు నుంచి ఆయనకు ఊరట లభించినట్లయింది.

Also Read:మొక్కలు నాటిన కేటీఆర్…

సీబీఐ నిర్ణయంపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు పేపర్ లీకేజీలపై కఠిన చట్టాలు తెస్తామని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం… మరోవైపు ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తికే క్లీన్ చిట్ ఇవ్వడంపై నిలదీస్తున్నారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన కేసులో కీలక నిందితుడిని ఇలా తప్పిస్తే, అసలు వ్యవస్థపై నమ్మకం ఎలా ఉంటుంది? అని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

- Advertisement -