పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లు-2026 ముసాయిదా

4
- Advertisement -

పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకేజీలపై మరింత కఠిన చర్యలు తీసుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక (సవరణ) బిల్లు-2026 ముసాయిదాను విడుదల చేసింది. ఈ బిల్లును రేపు లోక్‌సభలో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది.ఈ సవరణ బిల్లు ద్వారా పేపర్ లీకేజీలు, సంఘటిత పరీక్షా మోసాలపై ఉక్కుపాదం మోపేలా పలు కీలక నిబంధనలను చేర్చారు.

బిల్లులోని ముఖ్యాంశాలు:

– సాధారణ పరీక్షా అక్రమాలకు పాల్పడిన వారికి 5 నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం.
– ఇలాంటి నేరాలకు రూ.50 లక్షల వరకు జరిమానా విధించవచ్చు.
– పేపర్ లీక్ ముఠాలు, సంఘటిత నేరగాళ్లకు గరిష్ఠంగా రూ.10 కోట్ల వరకు జరిమానా విధించే నిబంధన.
– పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం లేదా అక్రమాలకు పాల్పడిన సర్వీస్ ప్రొవైడర్లపై రూ.5 కోట్ల జరిమానా విధించడంతో పాటు 8 సంవత్సరాల పాటు బ్లాక్‌లిస్ట్ చేయనున్నారు.
– కేసు నమోదైన రెండు నెలలలోపు దర్యాప్తు పూర్తి చేయడం తప్పనిసరి.
– విచారణ వేగవంతం కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయనున్నారు.
– ఛార్జ్‌షీట్ దాఖలైన మూడు నెలలలోపు విచారణ పూర్తి చేసి తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది.
– ఈ కేసులపై హైకోర్టులో ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన డివిజన్ బెంచ్ మాత్రమే అప్పీళ్లను విచారిస్తుంది. అప్పీళ్లను కూడా మూడు నెలలలోపు పరిష్కరించాల్సి ఉంటుంది.

Also Read:తెలుగు రాష్ట్రాల్లో తొలి ఏకాదశి శోభ

పరీక్షా వ్యవస్థలో పారదర్శకత పెంపు, పేపర్ లీక్ మాఫియాపై కఠిన చర్యలు, అభ్యర్థుల ప్రయోజనాల పరిరక్షణే ఈ సవరణ బిల్లుకు ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

- Advertisement -