CJP దేశవ్యాప్త నిరసనలు

2
- Advertisement -

సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ తన 26 రోజుల నిరాహార దీక్షను విరమించడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP)…కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తమ శాంతియుత నిరసన కొనసాగుతుందని స్పష్టం చేసింది.

NEET-UG 2026 ప్రశ్నపత్రం లీకేజీ వివాదంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ నేడు దేశవ్యాప్త శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చింది. ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేయడానికి దేశవ్యాప్తంగా నిర్వహించే శాంతియుత నిరసనలలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరింది. విద్యార్థి సంఘాలు, ఇతర సంస్థలు కలిసి పనిచేసి, నిరసనలు నిర్వహించడానికి అనుమతులు, సౌకర్యాలు సమకూర్చుకుని, విద్యార్థుల డిమాండ్లను గట్టిగా వినిపించాలని CJP విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలోనే, కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధి బృందం నేడు మధ్యాహ్నం 12:30 గంటలకు కేంద్ర ప్రభుత్వ మంత్రులతో సమావేశమయ్యే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి.

CJP అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ తెలిపిన వివరాల ప్రకారం..ఈ సమావేశం కోసం కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాని ఎంపిక చేశారు. జంతర్ మంతర్ వద్ద పార్టీ నిరసన చేపట్టిన ఒక నెల తర్వాత, CJP ప్రతినిధులకు మరియు మోదీ ప్రభుత్వానికి మధ్య జరిగిన మొదటి ప్రత్యక్ష సమావేశం ఈ వారంలోనే జరిగింది. CJP ప్రతినిధులు మూడు కీలక డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.

Also Read:కేటీఆర్‌కు సంతోష్ బర్త్‌ డే విషెస్

- Advertisement -