అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు అందిన విరాళాలలో జరిగినట్లుగా చెబుతున్న ఆర్థిక అక్రమాలపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం…సోమవారం (జులై 20)న SIT తన మధ్యంతర నివేదికను నేరుగా దేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) ముందు సమర్పించనుంది. ఈ నివేదికలోని అంశాల ఆధారంగా రామాలయ పరిపాలన, విరాళాల లెక్కింపు విధానాలలో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ కేసులో లోతైన విచారణ జరిపి సమగ్రమైన తుది నివేదికను సిద్ధం చేయడానికి ఎస్‌ఐటీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని మరికొంత సమయం కోరినట్లు సమాచారం.అక్రమాలకు సంబంధించిన అన్ని కోణాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉన్నందున ఈ అదనపు సమయం అవసరమని అధికారులు పేర్కొన్నారు. రామమందిర ట్రస్ట్ అభ్యర్థన మేరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జూన్ 13న ఈ ముగ్గురు సభ్యుల ఎస్‌ఐటీని ఏర్పాటు చేసింది. మొదట వీరికి 15 రోజుల సమయం ఇవ్వగా, ఆ తర్వాత జులై 1న ఈ గడువును మరో 15 రోజులు పొడిగించారు.
ఎస్‌ఐటీ ఇచ్చే తుది నివేదిక రామమందిర ట్రస్ట్ పనితీరుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా నగదు నిర్వహణ, విరాళాల సేకరణ, మరియు కౌంటింగ్ ప్రక్రియలలో పారదర్శకత కోసం కీలక సంస్కరణలను ఎస్‌ఐటీ సిఫార్సు చేయవచ్చని తెలుస్తోంది. కాగా, జులై 22న అయోధ్యలో జరగబోయే రామాలయ ట్రస్ట్ సమావేశంలో ఈ ఎస్‌ఐటీ కనుగొన్న అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు.
Also Read:కివీస్ బ్యాటింగ్ కోచ్..రాంచీ ఔట్!

