నైరుతి చైనాలో భారీ విపత్తు సంభవించింది. చోంగ్‌కింగ్ మునిసిపాలిటీ పరిధిలోని పెంగ్‌షుయ్ కౌంటీలో ఉన్న ఒక నివాస ప్రాంతంపై ఒక్కసారిగా భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘోర ప్రమాదంలో పదుల సంఖ్యలో ఇళ్లు నేలమట్టం కాగా, శిథిలాల కింద పలువురు స్థానికులు చిక్కుకుపోయినట్లు సమాచారం.
పెంగ్‌షుయ్ కౌంటీలోని ఊజియాంగ్ నది తీరాన ఉన్న కొండ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఈ విపత్తు సంభవించింది. ఉదయం 8 గంటల సమయంలో స్థానిక కమ్యూనిటీ అధికారి ఒకరు కొండపై నుండి చిన్న చిన్న రాళ్లు జారిపడటాన్ని గమనించి వెంటనే అప్రమత్తమయ్యారు. వెంటనే అక్కడ నివసిస్తున్న సుమారు 60 మందికి పైగా ప్రజలను ఖాళీ చేయాల్సిందిగా హెచ్చరికలు జారీ చేశారు.ఉరుముల్లా విరుచుకుపడిన కొండ: అయితే, ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తుండగానే.. ఉదయం 9:08 గంటల సమయంలో కొండపై నుంచి భారీ ఎత్తున మట్టి, రాళ్లు ఉప్పెనలా నివాసాలపైకి దూసుకొచ్చాయి.
కేవలం కొన్ని క్షణాల వ్యవధిలోనే 10 కి పైగా బహుళ అంతస్తుల నివాస భవనాలు మట్టి దిబ్బల కింద పూర్తిగా కూలిపోయాయి.ముమ్మరంగా సాగుతున్న రక్షణ చర్యలుఈ ఘోర ప్రమాదం జరిగిన వెంటనే చైనా ప్రభుత్వం అత్యవసరంగా లెవెల్-2 జాతీయ విపత్తు సహాయక చర్యలను ప్రకటించింది.రక్షణ బృందాల రంగప్రవేశం: దాదాపు 300 మందికి పైగా వృత్తినిపుణులైన రక్షక సిబ్బంది, ఫైర్ ఫైటర్లు ప్రత్యేక రక్షణ పరికరాలు మరియు 49 కి పైగా ప్రత్యేక వాహనాలతో ఘటనా స్థలానికి చేరుకున్నారు.9 మంది సురక్షితం: శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక బృందాలు ముమ్మరంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటివరకు సహాయక సిబ్బంది మట్టి దిబ్బల నుంచి తొమ్మిది మందిని సురక్షితంగా బయటకు తీశారు.
బయటపడిన వారికి ప్రాణాపాయం తప్పిందని, చికిత్స అందిస్తున్నామని స్థానిక అధికారులు తెలిపారు.సహాయక చర్యలకు ఆటంకం:కొండచరియలు విరిగిపడిన తీవ్రతకు ఆ ప్రాంతంలో విద్యుత్ స్థంభాలు కూలిపోయి విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీనివల్ల సహాయక చర్యలకు కొంత ఆటంకం కలుగుతోంది. విద్యుత్ పునరుద్ధరణ కోసం ప్రత్యేక సిబ్బంది కూడా రంగంలోకి దిగారు.ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇంకా ఎంతమంది శిథిలాల కింద చిక్కుకున్నారనే దానిపై స్పష్టత రావలసి ఉంది. క్షతగాత్రుల ప్రాణాలు కాపాడేందుకు సహాయక బృందాలు గాలింపు చర్యలను మరింత వేగవంతం చేశాయి.
Also Read:కివీస్ బ్యాటింగ్ కోచ్..రాంచీ ఔట్!

