ఈడీకి మేమేం భయపడలేదు!

1
- Advertisement -

పశ్చిమ బెంగాల్‌లోని అధికార టీఎంసీలో తిరుగుబాటు జరిగి, రీతాబ్రతా బెనర్జీ నేతృత్వంలోని రెబల్ వర్గంలో చేరిన మదన్ మిత్రా తనపై వస్తున్న విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. తన భార్య, ఇద్దరు కుమారులకు మున్సిపల్ నియామకాల కుంభకోణంలో ఈడీ నోటీసులు జారీ చేసిన మరుసటి రోజే ఆయన పార్టీ మారడంతో, కేంద్ర సంస్థల భయంతోనే ఆయన ఫిరాయించారంటూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. దీనిపై మదన్ మిత్రా స్పందిస్తూ ఈడీ భయం అనే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

కేంద్ర సంస్థ అయిన ఈడీ మమ్మల్ని భయపెట్టలేదు. వారు మమ్మల్ని పిలిచి బెదిరించలేదు. రాజకీయాలను ఈడీ దర్యాప్తుతో ముడిపెట్టకండి. మా కుటుంబానికి నోటీసులు వస్తే దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తాం. కానీ నా రాజకీయ నిర్ణయానికి, దానికి ఎలాంటి సంబంధం లేదు అన్నారు. మదన్ మిత్రా మాట్లాడుతూ తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు.

అభిషేక్ బెనర్జీ ఏకపక్ష నిర్ణయాలు, నియంతృత్వ ధోరణి వల్లే నేను పార్టీలో ఊపిరాడక సతమతమయ్యాను… నిజం చెప్పాలంటే ఈడీ కంటే అభిషేక్ బెనర్జీయే ఎక్కువ భయంకరంగా మారారు. పార్టీ కార్యకర్తలకు కాకుండా కేవలం ఒక్క వ్యక్తిని రక్షించడానికే టీఎంసీ ప్రయత్నిస్తోంది. అందుకే నేను అక్కడ ఇమడలేక బయటకు వచ్చాను అని చెప్పుకొచ్చారు. బిజెపిని ఓడించాలంటే కాలీఘాట్ (మమతా నివాసం) నుండి నడుస్తున్న విధానం కంటే మరింత బలమైన వ్యూహం కావాలి. అందుకే నేను ఈ కొత్త కూటమిలో చేరాను అన్నారు.

AlsoRead:కివీస్ బ్యాటింగ్ కోచ్..రాంచీ ఔట్!

 

- Advertisement -