న్యూజిలాండ్ క్రికెట్‌లో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత జట్టుతో స్వదేశంలో జరగబోయే సిరీస్ ముగిసిన తర్వాత జాతీయ జట్టు బ్యాటింగ్ కోచ్ పదవి నుండి ల్యూక్ రోంచి తప్పుకోనున్నారు. ఈ ఏడాది చివర్లో భారత్ మరియు న్యూజిలాండ్ జట్లు మల్టీ-ఫార్మాట్ సిరీస్‌లో తలపడనున్న సంగతి తెలిసిందే.
భారత్ సిరీస్ ముగిసిన వెంటనే రోంచి తన బ్యాటింగ్ కోచ్ బాధ్యతల నుండి తప్పుకుని, బిగ్ బాష్ లీగ్ (BBL) ఫ్రాంచైజీ అయిన ‘మెల్బోర్న్ రెనెగేడ్స్’ కు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. పీటర్ ఫుల్టన్ స్థానంలో 2020 నుండి రోంచి న్యూజిలాండ్ బ్యాటింగ్ కోచ్‌గా సేవలు అందిస్తున్నారు.
న్యూజిలాండ్ క్రికెట్ అత్యంత విజయవంతమైన కాలంలో రాంచి జట్టుతో భాగస్వామిగా ఉన్నారు. ఆయన పర్యవేక్షణలోనే కివీస్ జట్టు 2021 లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ విజేతగా నిలిచింది. అలాగే 2021 మరియు 2026 లలో టి20 వరల్డ్ కప్ ఫైనల్స్ చేరడంలో మరియు 2025 లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ వరకు దూసుకెళ్లడంలో రోంచి కీలక పాత్ర పోషించారు.
Also Read:TTD:వైభవంగా పవిత్రోత్సవాలు
ఇది తన కెరీర్‌లోనే అత్యున్నత ఘట్టాలలో ఒకటిగా అభివర్ణించారు రాంచీ. అలాగే న్యూజిలాండ్ క్రికెట్ భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా రోంచి స్థానంలో కొత్త కోచ్‌ను త్వరలోనే భర్తీ చేస్తామని బోర్డు ప్రకటించింది. ఈ జట్టు మరియు బ్యాటర్లు అత్యున్నత స్థాయిలో రాణించేలా సహాయపడటమే నా నిరంతర లక్ష్యం. వెనక్కి తిరిగి చూసుకుంటే నేను భాగమైన కొన్ని అద్భుతమైన మరియు గర్వించదగ్గ క్షణాలు నా ప్రయాణంలో ఉన్నాయి. ఇకపై కూడా నేను జట్టు ఆటను నిశితంగా గమనిస్తూనే ఉంటాను, భవిష్యత్తులో ఈ జట్టు మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ఉద్వేగంగా చెప్పారు.

