PK ఆస్తులెంతో తెలుసా?

3
- Advertisement -

బీహార్‌లోని బాంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక నామినేషన్ల పర్వంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ‘జన్ సురాజ్’ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ సోమవారం తన నామినేషన్ దాఖలు చేశారు. స్వయంగా ఎన్నికల బరిలోకి దిగిన ఆయన సమర్పించిన అఫిడవిట్‌లో తనకు రూ. 96 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ (BJP) అభ్యర్థి నీరజ్ సిన్హా కూడా నామినేషన్ దాఖలు చేయడంతో బాంకీపూర్ రాజకీయ వేదిక ఒక్కసారిగా వేడెక్కింది.

ప్రశాంత్ కిశోర్ మొత్తం ఆస్తుల విలువ: రూ. 96.06 కోట్ల కంటే ఎక్కువ.చరాస్తులు (Movable Assets): రూ. 22.19 కోట్లుకాగా స్థిరాస్తులు (Immovable Assets): రూ. 73.87 కోట్లు. చేతిలో ఉన్న నగదు: రూ. 65,570 కాగా ప్రశాంత్ కిశోర్‌కు ఒక ప్రైవేట్ కంపెనీలో 100 శాతం వాటా ఉంది. ఈ కంపెనీ ద్వారా ఆయన ‘జన్ సురాజ్’ పార్టీకి రూ. 85 కోట్లు, అలాగే ‘జన్ సురాజ్ ఫౌండేషన్’కు రూ. 50 లక్షల విరాళం ఇచ్చినట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

ప్రశాంత్ కిశోర్ భార్యకు కూడా భారీగా ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్ ద్వారా వెల్లడైంది. చరాస్తులు: రూ. 89.51 కోట్లుకాగా స్థిరాస్తులు: రూ. 12.42 కోట్లు. చేతిలో ఉన్న నగదు: రూ. 1,95,200గా ప్రకటించారు.

Also Read:సైబర్ ముప్పుపై అప్రమత్తత అవసరం!

- Advertisement -