హైదరాబాద్ హౌస్‌లో మోదీ-జపాన్ ప్రధాని!

4
- Advertisement -

పరస్పర వ్యూహాత్మక మరియు ప్రపంచవ్యాప్త సహకారాన్ని మరింత విస్తరించడానికి, బలోపేతం చేయడానికి ఉమ్మడి ప్రయత్నాల్లో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ… జపాన్  ప్రధాని సనాయ్ తకైచి గురువారం హైదరాబాద్ హౌస్‌లో ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు.

ఈ చర్చల్లో భారత ప్రతినిధి బృందంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అంతకుముందు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని సనాయ్ తకైచిలు హైదరాబాద్ హౌస్‌లోనే ద్వైపాక్షిక చర్చలు కూడా జరిపారు. పరస్పర నమ్మకంతో కూడిన రెండు దేశాల ప్రత్యేక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఈ చర్చలు మరో కీలక అడుగుగా నిలిచాయి.

ఈ ద్వైపాక్షిక చర్చల సమయంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో పాటు ఇతర అధికారులు కూడా హాజరయ్యారు.అంతకుముందు, జపాన్ ప్రధాని తకైచికి రాష్ట్రపతి భవన్‌లో అధికారిక (సాంప్రదాయ) స్వాగతం లభించింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్ (X) వేదికగా పంచుకుంటూ.. మన ప్రత్యేక భాగస్వామ్యం మరింత బలపడుతోంది. జపాన్ ప్రధాని సనాయ్ తకైచికి రాష్ట్రపతి భవన్ ఆవరణలో అధికారిక స్వాగతం లభించింది. పరస్పర నమ్మకం మరియు ఉమ్మడి విలువల పునాదిపై నిర్మితమైన భవిష్యత్తు భాగస్వామ్యం ఇది అని పేర్కొన్నారు.

రాష్ట్రపతి భవన్ ఆవరణలో జరిగిన ఈ స్వాగత వేడుకల సందర్భంగా, ప్రధాని మోదీ తన కేబినెట్ సహచరులను మరియు ఇతర ప్రముఖులను జపాన్ ప్రధానికి పరిచయం చేశారు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు తకైచి జూలై 1 నుండి 3 వరకు మూడు రోజుల పాటు భారతదేశంలో అధికారిక పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె ’16వ భారత్-జపాన్ వార్షిక సదస్సు’లో పాల్గొంటారు. ఈ సదస్సులో ఇరు దేశాల ద్వైపాక్షిక సహకారాన్ని సమగ్రంగా సమీక్షించడంతో పాటు పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై చర్చించే అవకాశం ఉంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తెలిపిన వివరాల ప్రకారం.. వ్యూహాత్మక, ఆర్థిక, సాంకేతిక మరియు భద్రతా రంగాలలో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి ఈ సదస్సు ఇరు దేశాల నాయకులకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుంది.

Also Read:చర్చలకు పిలిచి..పారిపోతారా?:కేటీఆర్

- Advertisement -