TVKలోకి అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యేలు

1
- Advertisement -

తమిళనాడు రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) పార్టీకి చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు మరియు వందలాది మంది కార్యకర్తలు గురువారం మహాబలిపురంలో జరిగిన ఒక కార్యక్రమంలో సీఎం విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) పార్టీలో అధికారికంగా చేరారు.

టీవీకే పార్టీ అగ్ర నాయకత్వం సమక్షంలో ఈ చేరికల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఏఐఏడీఎంకేను వీడి విజయ్ పార్టీలోకి వచ్చిన వారిని టీవీకే శ్రేణులు ఘనంగా స్వాగతించాయి. క్షేత్రస్థాయిలో బలమైన పట్టున్న పాత తరం ద్రావిడ పార్టీల నుండి నాయకులు, క్యాడర్ ఇలా కొత్తగా ఏర్పడిన ‘తమిళగ వెట్రి కజగం’ వైపు మొగ్గు చూపడం విజయ్ రాజకీయ ప్రస్థానానికి మరింత బలాన్ని చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఆశయాలు, తమిళనాడు అభివృద్ధికి ఆయన ప్రదర్శిస్తున్న నిబద్ధత తమను ఎంతగానో ఆకర్షించాయని, అందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా విజయ్ సారథ్యంలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.

Also Read:చర్చలకు పిలిచి..పారిపోతారా?:కేటీఆర్

- Advertisement -