సంక్షేమ శాఖలో రూ.2000 కోట్ల కుంభకోణంపై హరీష్ రావు ఆరోపణలు చేస్తే చర్చ కోసం ముగ్గురు మంత్రులు గన్ పార్క్ దగ్గరికి రమ్మని అన్నారు.. ముగ్గురు మంత్రులతో మాట్లాడడానికి హరీష్ రావు బయలుదేరితే తెలంగాణ భవన్ బయటే అరెస్ట్ చేశారు అని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
ఒక మంత్రి ఏమో తెలంగాణ భవన్ దగ్గరికి వస్తానని చెప్పి పారిపోయాడు.. ముగ్గురు మంత్రులు ఏమో గన్ పార్కు వద్దకు రమ్మని అరెస్ట్ చేయిస్తున్నారు..ఇంత భయం ఎందుకు.. కావాలంటే అసెంబ్లీ పెట్టండి. అక్కడే చర్చిద్దాం అన్నారు.
తెలంగాణ భవన్‌కి వస్తానని ఫోజులు కొట్టమన్నది ఎవరు.. మళ్లీ గన్ పార్క్ అని లొకేషన్ మార్చామన్నది ఎవరు..నీకంటే పోలీస్ వాళ్ల ఎస్కార్ట్ ఉంది.. కానీ మమ్మల్ని ఏమో బైటకి పోతే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు ..పోలీసులని ఎవరు పంపుతున్నారు.. ముఖ్యమంత్రా, లేదా మంత్రులా చెప్పాలన్నారు.
చర్చలని మీరే పిలుస్తారు.. మళ్లీ పారిపోయేది మీరే ..చాతకాని వెధవలు ఎవరో ప్రజలు చూస్తున్నారు …ఇప్పటికైనా గన్ పార్క్ దగ్గర ఉండు మేము వస్తాము.. మళ్లీ మీ పోలీస్ వాళ్ళని పిలిచి అరెస్ట్ చేయించొద్దు అన్నారు. నిద్ర పోయే వాడిని లేపొచ్చు.. నిద్రని నటించే వాడిని ఎక్కడ లేపగలం …రేవంత్ రెడ్డికి ప్రజాక్షేత్రంలో ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానాలు చెప్పే దైర్యం లేదు…గతంలో రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరించి మేము ప్రెస్ క్లబ్‌కు వెళ్తే రాకుండా మొహం చాటేసి పారిపోయాడు అన్నారు.
మరోసారి తెలంగాణ అప్పులపై రేవంత్ రెడ్డి సవాల్ విసిరితే మేము సిద్దమని చెప్పాం.. మళ్లీ రాకుండా తొకముడిచి పారిపోయాడు..మద్యలో సందట్లో సడేమియా అని మంత్రి జూపల్లి దూరి తెలంగాణ భవన్‌కు వస్తానని డైలాగులు వేశాడు.. ఆయన కోసం మేము ఉదయం 10 గంటలకే వచ్చి కూర్చుంటే రాకుండా ఇప్పుడు ఎక్కడో కూర్చొని సేమ్ డైలాగులు వేస్తున్నాడు అని ఎద్దేవా చేశారు.
Also Read:నాగబంధం..చాలా కాస్ట్లీ సినిమా!

