బీజేపీ పార్టీపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ సంచలనారోపణలు చేశారు. లోక్‌సభలో మూడింట రెండు వంతుల మెజారిటీని సాధించడానికి బీజేపీ పడుతున్న ఆరాటం వెనుక రాజ్యాంగాన్ని సవరించి, దేశంలో రిజర్వేషన్ల వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలనేదే అని తీవ్ర ఆరోపణలు చేశారు.
మహిళల రిజర్వేషన్ల ముసుగులో నియోజకవర్గాల పునర్విభజనను ముందుకు నెట్టాలని బీజేపీ చూస్తోందని, తద్వారా పార్లమెంట్‌లో సీట్లను పెంచుకుని రిజర్వేషన్లను పూర్తిగా ముగించాలనేది వారి ప్లాన్ అని జైరాం రమేష్ ఆరోపించారు. ప్రభుత్వానికి నిజంగానే మహిళా రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాల ప్రాతిపదికనే రాబోయే 2029 సార్వత్రిక ఎన్నికల్లో నారీ శక్తి వందన్ అధినియమ్ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
తృణమూల్ కాంగ్రెస్ (TMC), శివసేన (UBT) వంటి ప్రతిపక్ష పార్టీలను చీల్చేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రయత్నిస్తున్నారని, ఇది తాము గతంలో చేసిన ‘400 పార్’ (400 దాటాలి) ఆరోపణలను నిజం చేస్తోందని కాంగ్రెస్ పేర్కొంది. రాజ్యాంగాన్ని మార్చడానికే బీజేపీకి అంతటి మెజారిటీ కావాలని తాము 2024 ఎన్నికల ప్రచారంలో చెప్పిన మాటలు ఇప్పుడు అక్షరాలా నిజమవుతున్నాయని జైరాం రమేష్ అన్నారు.
ఇటీవల పార్లమెంట్‌లో నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన మూడు బిల్లులను ఆమోదించుకోవడంలో విఫలమై, కేవలం 298 ఓట్లు మాత్రమే సాధించగలిగినందుకు కలిగిన పరాభవంతోనే అమిత్ షా ప్రతిపక్ష పార్టీలను చీల్చే రాజకీయాలకు తెరలేపారని కాంగ్రెస్ విమర్శించింది.
Also Read:TMC:ఈసీ ముందుకు టీఎంసీ సంక్షోభం!

