ధర్మన్ గుట్టు విప్పిన రజనీ!

0
- Advertisement -

కోలీవుడ్ ఇండస్ట్రీలో గత ఐదు దశాబ్దాలుగా మంచి స్నేహితులు, ఇద్దరు అగ్ర నటులు రజనీకాంత్, కమల్ హాసన్ చాలా కాలం తర్వాత ఒకే ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపారు. కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ ‘రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ (RKFI) బ్యానర్‌పై రజనీకాంత్ 173వ సినిమాగా రాబోతున్న చిత్రానికి ‘ధర్మన్’ అనే శక్తివంతమైన టైటిల్‌ను ఖరారు చేశారు.

చెన్నైలో జరిగిన ఈ సినిమా పూజా కార్యక్రమం మరియు టైటిల్ లాంచ్ ఈవెంట్‌లో రజనీకాంత్ మాట్లాడుతూ.. ఈ కథ అశ్వత్ మారిముత్తు (ఓ మై కడవులే ఫేమ్) చేతికి రావడానికి ముందు జరిగిన సుదీర్ఘ ప్రయాణాన్ని వివరించారు. మీడియాలో ఈ సినిమాకు ముగ్గురు దర్శకులు మారారని వస్తున్న వార్తలపై రజనీకాంత్ నవ్వుతూ స్పందించారు. “నిజానికి ఈ ప్రాజెక్ట్ కోసం ముగ్గురు కాదు, నలుగురు దర్శకులు మారారు” అని ఆయన అసలు విషయాన్ని బయటపెట్టారు.

మొదటగా కమల్ హాసన్ ప్రొడక్షన్‌లో సినిమా అనగానే సీనియర్ దర్శకుడు కె.ఎస్. రవికుమార్‌తో ఒక వెర్షన్ అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ కాంబినేషన్ కుదరలేదు. ఆ తర్వాత దర్శకుడు సుందర్ సి ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. సినిమా అనౌన్స్‌మెంట్ కూడా జరిగింది. అయితే ముందే ఒప్పుకున్న ఇతర సినిమాల కమిట్‌మెంట్లు మరియు కొన్ని అనివార్య కారణాల వల్ల సుందర్ సి ఈ సినిమా నుండి తప్పుకోవాల్సి వచ్చింది.

సుందర్ సి తర్వాత ‘డాన్’ సినిమా దర్శకుడు సిబి చక్రవర్తి రంగంలోకి దిగారు. ఆయన కొంతకాలం పాటు ప్రి-ప్రొడక్షన్ పనులు కూడా చేశారు. కానీ ఆయన సిద్ధం చేసిన కథాంశం రజనీకాంత్‌కు పూర్తిగా సంతృప్తిని ఇవ్వకపోవడంతో ఆ వెర్షన్ కూడా కార్యరూపం దాల్చలేదు. ఈ సందర్భంగా రజనీకాంత్ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. కమల్ హాసన్ కొత్త ఆఫీస్ ప్రారంభించినప్పుడు నాతో.. నేను పెద్ద ఆఫీస్ తెరిచాను, నా బ్యానర్‌లో నువ్వు ఒక సినిమా చేయాలి అని అడిగారు. ఆ తర్వాత ఇద్దరం బిజీ అయిపోయాం. కానీ ఇటీవల మళ్లీ మాట్లాడినప్పుడు కమల్ వాయిస్‌లో ఈ సినిమా చేయాలనే పట్టుదల, సీరియస్‌నెస్ నాకు కనిపించాయి. అందుకే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను అని రజనీ తెలిపారు.

ఈ చిత్రంలో రజనీకాంత్ ఒక పవర్‌ఫుల్ ‘డాక్టర్’ పాత్రలో కనిపిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో బ్లూ సర్జికల్ డ్రెస్ వేసుకుని, చేతిలో రక్తం చిందిన సర్జికల్ బ్లేడ్‌తో రజనీ మాస్ లుక్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, సిమ్రాన్, రాశి ఖన్నా మరియు యోగి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Also Read:TMC:ఈసీ ముందుకు టీఎంసీ సంక్షోభం!

- Advertisement -