2026వ సంవత్సరం సరిగ్గా 12యేండ్లు అయింది తెలంగాణ వచ్చి…స్వరాష్ట్రం సాధించిన తర్వాత అభివృద్ధి పథంలో కేసీఆర్ నాయకత్వంలో తీసుకొని పోయాం అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.మల్కాజ్‌గిరి నియోజకవర్గ సమావేశంలో మాట్లాడిన కేటీఆర్.. నాడు 2014కు ముందు మల్కాజిగిరి ఏవిధంగా ఉందో ఒక్కసారి అక్కచెల్లెళ్ళు గుర్తుకు తెచ్చుకోవాలి అన్నారు.అనాడు కరెంట్ కోతలు,ఖాళీ బిందలతో నిరసనలు ,ఎక్కడ చూసిన ఇన్వర్టర్లు,కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్స్ ,పారిశ్రామిక రంగంకు వారం కు మూడు రోజుల పవర్ హాలిడే లు ఉండేవన్నారు. ఇందిరా పార్కు వద్ద పారిశ్రామిక వేత్తలు ధర్నాలు చేసేవారు..కేసీఆర్ వచ్చినాడు పెన్షన్ 200లు,మన నాయకుడూ కేసీఆర్ నాయకత్వంలో 6నెలల్లో కరెంట్ పరిష్కారం చేసుకున్నాము అన్నారు.
రెప్పపాటు కూడా కరెంట్ పోకుండా వ్యవసాయ రంగానికి కరెంట్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్..బస్తీ కి అయిన పల్లెకు అయిన ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ …ఆడపిల్లల పెళ్లికి కళ్యాణ లక్ష్మీ కింద లక్ష 16వేలు ఇచ్చుకున్నాం అన్నారు.లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టుకున్నాం ఈ హైదరాబాద్ నగరంలో…అందుకే హైదరాబాద్ నగర ప్రజలు బ్రహ్మాండంగా గులాబీ పార్టీకి పట్టం కట్టారు…ఇక్కడ మళ్ళీ మన పార్టీనే గెలుస్తోంది అన్నారు.
హైద్రాబాద్ లో కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వం ను తిట్టుకొనింనిషి లేడు.3సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం డిజాస్టర్.అడ్డగోలు మాటలు చెప్పి అనేక హామీలు ఇచ్చి ఇవాళ ఏం చేస్తోందో అందరికీ తెలుసు …కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తే నేను తులం బంగారం ఇస్తాను అని పెద్ద పెద్ద మాటలు చెప్పాడు రేవంత్ ..అత్తకు నాలుగు వేలు కోడలుకి రెండున్నర వేలు ఇస్తానని అడ్డగోలు మాటలు చెప్పి గద్దెన్నేక్కడు రేవంత్ అన్నారు. గ్యారెంటీ కార్డులు కొట్టించాడు వంద రోజుల్లో అన్ని అమలు చేస్తామని కానీ ఇప్పటికీ ఒక్కటి కూడా అమలు కాలేదు …ఈ గ్యారెంటీ కార్డు భద్రంగా పెట్టుకోండి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నాడు.ఇప్పుడు వంద రోజులు కాదు తొమ్మిది వందల రోజులు అయింది ఏమైంది మీ హామీ అని అడిగినమ్…వంద రోజుల్లో పిల్లలు పుడతారా అన్నాడు మరి ముప్పై నెలలు అయింది ఏమైంది చెప్పాలన్నారు.
ఆయనకు చేతన కావడం లేదు పాలన చేయడం ఆయన నుండి కావడం లేదు తెలంగాణ వచ్చే వరకు కాంగ్రెస్ వాళ్ళు ఒక్క కొత్త దవాఖాన కట్టలేదు ..కానీ తెలంగాణ వచ్చాక మన నాయకుడు కేసీఆర్ 4 తెలంగాణ మెడికల్ కాలేజీ లు కట్టాడు.రేవంత్ రెడ్డి జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నాడు ..మనం కట్టిన భవనాలకు ఆయన రిబ్బన్ కట్ చేస్తున్నాడు.ఆయన కత్తెర పట్టుకొని కట్ చేసూడు,ఉన్న గోడలకు రంగు వేసుడు ..కేసీఆర్ అప్పు చేస్తే అనేక సంక్షేమ పథకాలు అమలు చేశాడు ..కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నర యేండ్లు ఐంది 4లక్షల కోట్ల అప్పు చేశారు మరి మీరు చేశారు …హైద్రాబాద్ లో ఒక్క ఇల్లు కట్టలేదు,పేదలకు ఏం చేశావు…కానీ పేదల ఇండ్లు కూల్చుతున్నాడు అన్నారు.
Also Read:Stock crash:ఐటీ షేర్లు..ఢమాల్
రేవంత్ తెలంగాణ లో ప్రతి వర్గాన్ని మోసం చేశారు.తులం బంగారం ఇచ్చే బ్యాచ్ కాదు…ఉన్నది ఎత్తుకపోయే దండుపాళ్యం బ్యాచ్ ఇది.మహిళల లని కోటీశ్వరులను చేస్తా అని అంటున్నారు…దానికన్నా ముందు నువ్వు ఇచిన హామీ మేరకు నెరవేర్చు.మళ్ళీ కేసీఆర్ సీఎం అవ్వాలని అనుకుంటే మీరే విజృంభించాలి.చీకటి నీ చూస్తే నే వెలుగు విలువ తెలుస్తుంది.ఈ 5 ఏళ్లు మన మంచికే అనుకోవాలి.రైతుల ధాన్యం కొనడానికి సంచులు లేవు.సంచులన్నీ డిల్లీ కి పోతున్నాయి.ఇక్కడ ప్రభుత్వం నడపడం లేదు.ఒక మాఫియా నడుపుతున్నారు.ఎస్ ఐ ఆర్ సర్వే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది.మన ఓటర్ లను కాపాడుకోవాల్సిన బాధ్యత మనది.పశ్చిమ బెంగాల్ లో 90 లక్షల ఓట్లు,బీహార్ లో 60 లక్షల ఓట్లు తొలంగిచారు.కేంద్రానికి ఓటు వేయరాని అనుకున్న ఓట్లు తొలగిస్తున్నారు అని ఒక అనుమానం ఉంది.మనకు దొంగ ఓట్లు అవసరం లేదు…మన వారి ఓట్లు కాపాడుకోవాలి అన్నారు.

