Stock crash:ఐటీ షేర్లు..ఢమాల్

2
- Advertisement -

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ షేర్ల విలువ శుక్రవారం ఏకంగా 8 శాతానికి పైగా కుప్పకూలింది. యాక్సెంచర్ కంపెనీ ఆదాయ అంచనాలు తగ్గినట్లుగా ప్రకటించడంతో రాత్రికి రాత్రే ఆ కంపెనీ అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్ (ADR) భారీగా పడిపోయాయి. దీని ప్రభావంతో భారతీయ ఐటీ స్టాక్స్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

బీఎస్‌ఈ (BSE)లో ఇన్ఫోసిస్ షేరు క్రితం ముగింపు రూ. 1,127.25తో పోలిస్తే 5.7 శాతం నష్టంతో రూ. 1,063.05 వద్ద గ్యాప్-డౌన్‌తో ప్రారంభమైంది. ఆ తర్వాత ప్రాఫిట్ బుకింగ్ (లాభాల స్వీకరణ) కారణంగా మరింత క్షీణించి,,రూ. 96.9 (8.6 శాతం) నష్టంతో రూ. 1,030.35 వద్ద ఇంట్రాడేలో సరికొత్త 52 వారాల కనిష్ట స్థాయిని తాకింది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ట స్థాయి రూ. 1,727.85 (ఫిబ్రవరి 3, 2026 న నమోదైంది). చివరిగా అందిన సమాచారం ప్రకారం ఈ షేరు రూ. 82.10 (7.28 శాతం) నష్టంతో రూ. 1,045.15 వద్ద ట్రేడవుతోంది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 4,23,476.09 కోట్లుగా ఉంది.

ఒక్క ఇన్ఫోసిస్ మాత్రమే కాకుండా నేడు నిఫ్టీ ఐటీ స్టాక్స్ అన్నీ నష్టాల్లోనే ట్రేడయ్యాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ దాదాపు 6 శాతం పడిపోగా, నిఫ్టీ మిడ్ స్మాల్ ఐటీ & టెలికాం సూచీ 2 శాతానికి పైగా క్షీణించింది.

టిసిఎస్ : క్రితం ముగింపు రూ. 2,203.30 తో పోలిస్తే 6.01 శాతం (132.40 పాయింట్లు) భారీగా పతనమైంది.

హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ : క్రితం ముగింపు రూ. 1,161.80 నుండి 5.11 శాతం పడిపోయింది.

విప్రో : 3.30 శాతం క్షీణతను నమోదు చేసింది.

కోఫోర్జ్ : 4.50 శాతం దిగజారింది.

Also Read:ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే..ఇరాన్ వార్నింగ్!

గ్లోబల్ ఐటీ దిగ్గజం యాక్సెంచర్ తన భవిష్యత్తు ఆదాయాలపై బలహీనమైన అంచనాలను ప్రకటించడమే దీనికి ప్రధాన కారణం. దీని ప్రభావంతో అమెరికా మార్కెట్లలో ఇన్ఫోసిస్ ఏడీఆర్ (ADR) 9.7 శాతం, విప్రో ఏడీఆర్ 3.6 శాతం చొప్పున క్షీణించాయి. గ్లోబల్ ఐటీ క్లయింట్లు తమ ఐటీ ఖర్చులను తగ్గించుకుంటున్నారనే ఆందోళనల మధ్య భారతీయ ఐటీ రంగ సూచీ ఏకంగా 6 శాతం పైగా కుప్పకూలింది.

- Advertisement -