మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్, శరద్ పవార్‌కు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకుంటాయా?, తృణమూల్ కాంగ్రెస్‌లో సంక్షోభం నడుస్తున్న వేళ గతంలో కాంగ్రెస్ నుండి విడిపోయిన పార్టీలు తిరిగి మాతృసంస్థలో విలీనం కావడానికి ప్రణాళికలు వేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో బలమైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
తృణమూల్ విలీన చర్చలను కాంగ్రెస్ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పుకార్లు అని కొట్టిపారేయగా మహారాష్ట్రకు చెందిన పార్టీ సీనియర్ నేత నానా పటోలే మాత్రం ఈ దిశగా అడుగులు పడుతున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఒకే భావజాలం గల పార్టీలు కాంగ్రెస్‌లో విలీనం కావడానికి సిద్ధమవుతున్నాయని పటోలే చెప్పారు. శరద్ పవార్, మమతా బెనర్జీలు కాంగ్రెస్‌తో విలీనం కావడానికి మనసు మార్చుకుంటున్నారు అని పటోలే పేర్కొన్నారు. ఇది కేవలం పొత్తు మాత్రమే కాదు విలీనం అవుతుందని చెప్పారు.
ఎన్సీపీ (NCP-SP) విలీనానికి సంబంధించిన ప్రతిపాదనను శరద్ పవార్ ఇప్పటికే ఇచ్చారని ఆ ప్రక్రియ కొనసాగుతోందని పటోలే క్లెయిమ్ చేశారు. ఎన్సీపీ నుండి పవార్ సాహెబ్ నుండి ప్రతిపాదన ఇదివరకే వచ్చింది కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. అయితే ప్రస్తుతం దేశ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలను బట్టి… ఓట్ల భారీ చీలికను నిరోధించడానికి… లౌకిక సిద్ధాంతాలు కలిగిన అన్ని పార్టీలు ఏకం కావాలని నేను భావిస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ బలంగా మారాలి, దాని నుండి ఉద్భవించిన చిన్న పార్టీల నాయకులు ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకోవాలి అని రౌత్ అన్నారు.
ఈ రాజకీయ చర్చలకు మరింత బలాన్ని చేకూరుస్తూ, సీనియర్ కాంగ్రెస్ నేత, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా చిన్న పార్టీలను కాంగ్రెస్‌లో విలీనం చేసి, రాహుల్ గాంధీని తమ నాయకుడిగా అంగీకరించాలని పిలుపునిచ్చారు. సంజయ్ రౌత్ చెప్పిన దాంట్లో అర్ధం ఉంది…. సమయం ఆసన్నమైంది, కాంగ్రెస్ నుండి విడిపోయి ప్రాంతీయ పార్టీలుగా మారిన వారంతా తిరిగి చేరాలి, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని పూర్ణమనస్సుతో అంగీకరించాలి అని గెహ్లాట్ అన్నారు.
Also Read:సింగ్ గీతం..పెద్ద బ్లాక్‌బస్టర్!
శరద్ పవార్, మమతా బెనర్జీ ఇద్దరూ గతంలో కాంగ్రెస్ నుండి విడిపోయి తమ స్వంత ప్రాంతీయ పార్టీలను స్థాపించారు. మమతా బెనర్జీ 1998లో కాంగ్రెస్ నుండి విడిపోయి తృణమూల్ కాంగ్రెస్‌ను ప్రారంభించగా, శరద్ పవార్ 1999లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP)ని స్థాపించారు.

