తృణమూల్ కాంగ్రెస్ లో తలెత్తిన తాజా తిరుగుబాటుపై ఆ పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీ కల్యాణ్ బెనర్జీ తీవ్రంగా స్పందించారు. పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు చేసి, ఎన్డీయే (NDA) కూటమికి మద్దతు ప్రకటించిన ఎంపీలను, వారి వెనుక ఉన్న బీజేపీని ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
బీజేపీపై విమర్శలు గుప్పిస్తూ.. మీకు ఈడీ , సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల బలం ఉండవచ్చు. కానీ నా వెనుక మా పార్టీ వెనుక మమతా బెనర్జీ నినాదమైన మా, మాటీ, మానుష్ ‘ (తల్లి, మాతృభూమి, ప్రజలు) శక్తి ఉంది అని కల్యాణ్ బెనర్జీ స్పష్టం చేశారు. ఏలాంటి బెదిరింపులకు తాము లొంగబోమని అన్నారు.
పార్టీకి ద్రోహం చేసి తమ స్వార్థ ప్రయోజనాల కోసం బీజేపీ పంచన చేరిన తిరుగుబాటు ఎంపీలను పశ్చిమ బెంగాల్ ప్రజలు ఎప్పటికీ క్షమించరని ఆయన మండిపడ్డారు. బెంగాల్ సంస్కృతి…అస్తిత్వాన్ని కాపాడటంలో తృణమూల్ కాంగ్రెస్ ఎల్లప్పుడూ ముందుంటుందని చెప్పారు.
లోక్‌సభలో చీఫ్ విప్ పదవికి సంబంధించి తలెత్తిన వివాదంపై ఆయన స్పందిస్తూ.. తాను ఇదివరకే విప్‌గా నియమితుడైనట్లు అధికారిక లేఖలు ఉన్నాయని తెలిపారు. చట్ట వ్యతిరేకంగా మరియు ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘిస్తూ వ్యవహరిస్తున్న తిరుగుబాటుదారులపై స్పీకర్ కార్యాలయం ముందు న్యాయపరమైన పోరాటం చేస్తామని కల్యాణ్ బెనర్జీ పేర్కొన్నారు.
Also Read:టీఎంసీపై అధిర్ రంజన్ ఫైర్

