టీఎంసీపై అధిర్ రంజన్‌ ఫైర్

3
- Advertisement -

తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీపై తీవ్ర విమర్శలు గుప్పించారు పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి . బెహ్రాంపూర్ లోక్‌సభ నియోజకవర్గంలో నన్ను ఓడించడమే లక్ష్యంగా టీఎంసీ మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్‌ను బరిలోకి దించిందని ఆరోపించారు.

మమతా బెనర్జీ ఒక ముస్లిం అభ్యర్థిని (యూసుఫ్ పఠాన్) తీసుకువచ్చి ఇక్కడి ముస్లిం ఓట్లను దక్కించుకోవాలని చూశారని తద్వారా హిందూ ఓట్లన్నీ బీజేపీ వైపు మళ్లేలా చేసి లబ్ధి పొందాలని భావించారని అన్నారు. నన్ను రాజకీయంగా దెబ్బతీయడానికి మరియు బెహ్రాంపూర్‌లో మతపరమైన విభజన తీసుకురావడానికి మమతా బెనర్జీ మొదటి నుంచీ ప్రణాళికలు వేశారు. అందుకోసమే గుజరాత్‌కు చెందిన యూసుఫ్ పఠాన్‌ను ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టారు అని పేర్కొన్నారు.

యూసుఫ్ పఠాన్ స్థానికుడు కాదనే అంశాన్ని ప్రస్తావిస్తూ.. పశ్చిమ బెంగాల్ వెలుపలి వ్యక్తికి టికెట్ ఇవ్వడం ద్వారా మమతా బెనర్జీ బెంగాలీ సెంటిమెంట్‌ను దెబ్బతీశారని విమర్శించారు. బెహ్రాంపూర్ నియోజకవర్గంలో స్థానిక సమస్యలపై అవగాహన ఉన్నవారే ప్రాతినిధ్యం వహించాలని ఆయన అభిప్రాయపడ్డారు.

బీజేపీని ఓడించడమే లక్ష్యంగా జాతీయ స్థాయిలో ఏర్పడిన ప్రతిపక్షాల ‘ఇండియా’ (INDIA) కూటమిలో టీఎంసీ కూడా భాగస్వామిగా ఉన్నప్పటికీ బెంగాల్‌లో మాత్రం కాంగ్రెస్‌ను బలహీనపరచడానికి మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారని అధిర్ రంజన్ చౌదరి అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీని ఎదుర్కొనే విషయంలో టీఎంసీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆయన ఆరోపించారు.

Also Read:హెచ్-1బి వీసా దారులకు గుడ్‌న్యూస్

- Advertisement -