సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి షాక్!

3
- Advertisement -

ఒకప్పుడు దేశంలోనే నంబర్ 1 సైబర్ సెక్యూరిటీ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) అధికారిక ‘X’ (గతంలో ట్విట్టర్) ఖాతా హ్యాకింగ్‌కు గురైంది. గత మే నెల 22వ తేదీనే సైబర్ నేరగాళ్లు ఈ అకౌంట్‌ను హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, అత్యంత విచిత్రమైన విషయం ఏమిటంటే, హ్యాకింగ్ జరిగి దాదాపు 20 రోజులు గడుస్తున్నా సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఈ విషయాన్ని గుర్తించలేకపోవడం గమనార్హం.

ప్రజలకు సైబర్ భద్రత, రక్షణ కల్పించాల్సిన ప్రధాన వి ధులను వదిలేసి, సోషల్ మీడియా యాక్టివిస్టులపై రాజకీయ కక్షసాధింపు చర్యలు మరియు కేసులు పెట్టడంపైనే అధికారులు ఎక్కువ దృష్టి పెట్టారని, అందుకే ఇలాంటి ఘోర తప్పిదం జరిగిందని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా కామెంట్స్ చేస్తున్నారు. సైబర్ నేరాలను అరికట్టాల్సిన సంస్థ అకౌంటే హ్యాక్‌కు గురవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -