కొత్త రూల్ తీసుకొచ్చిన UPSC!

2
- Advertisement -

సివిల్ సర్వీసెస్ పరీక్షా ప్రక్రియ యొక్క పారదర్శకతను, విశ్వసనీయతను మరింత బలోపేతం చేయడానికి మరియు ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాసే మోసాలకు అడ్డుకట్ట వేయడానికి కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) విజయవంతంగా ‘ఫేస్ అథెంటికేషన్ ప్రోటోకాల్‌ను అమలు చేసింది. ఇటీవల నిర్వహించిన సివిల్ సర్వీసెస్ మరియు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ప్రిలిమినరీ) పరీక్షలు-2026 లో ఈ విధానాన్ని విజయవంతంగా ఉపయోగించారు.

అభ్యర్థి అప్లికేషన్ ఫారమ్ నింపే సమయంలో అప్‌లోడ్ చేసిన ఫోటో, హాల్ టికెట్‌తో పరీక్ష రాయడానికి వచ్చిన అభ్యర్థి ముఖం ఒకటేనా కాదా అని నిర్ధారించుకోవడానికి ఈ ప్రోటోకాల్ ఉపయోగపడుతుంది. యూపీఎస్‌సీ తెలిపిన వివరాల ప్రకారం, ఈ సిస్టమ్ ద్వారా పరీక్షా కేంద్రాల్లో ఇన్విజిలేటర్లు తమ మొబైల్ ఫోన్ల ద్వారా అభ్యర్థుల గుర్తింపును రియల్ టైమ్‌లో (అప్పటికప్పుడు) ధృవీకరించారు. దీనివల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా తనిఖీలు పూర్తయ్యాయి మరియు మాల్‌ప్రాక్టీస్, ఒకరి బదులు మరొకరు పరీక్ష రాసే అవకాశాలు పూర్తిగా తొలగిపోయాయి.

ఈ ఏడాది దేశవ్యాప్తంగా 2,072 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్షల్లో యూపీఎస్‌సీ ఈ రియల్ టైమ్ ఫేస్ అథెంటికేషన్‌ను నిర్వహించింది. ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన ‘నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్’ (NeGD) సాంకేతిక సహకారంతో యూపీఎస్‌సీ ఈ ఫేస్

పరీక్షా హాలులోకి ప్రవేశించడానికి ముందే ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా ఈ ఫేస్ అథెంటికేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం యూపీఎస్‌సీ ఒక వివరణాత్మక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) ని రూపొందించి, పరీక్షలు జరిగే అన్ని రాష్ట్రాలు, జిల్లాలు మరియు పరీక్షా కేంద్రాలకు పంపింది. ఇన్విజిలేటర్లకు దీనిపై పలు రౌండ్ల శిక్షణ ఇచ్చాం. ఈ సాంకేతికతలో ఉన్న గొప్పతనం ఏంటంటే, దీనికోసం ఎటువంటి ఖరీదైన హార్డ్‌వేర్ పరికరాలు అవసరం లేదు అని యూపీఎస్‌సీ తన ప్రకటనలో పేర్కొంది. ఇది ఎలాంటి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లోనైనా పనిచేస్తుంది. ఇన్విజిలేటర్లు ఇందుకోసం వారి స్వంత మొబైల్ ఫోన్లనే ఉపయోగించారు, దీనివల్ల హార్డ్‌వేర్ ఖర్చులు తగ్గడమే కాకుండా రవాణా, నిర్వహణ భారం కూడా తప్పింది అన్నారు.

- Advertisement -