భారత్‌పై పుతిన్ ప్రశంసలు

3
- Advertisement -

భారతదేశంపై ప్రశంసలు గుప్పించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. భారత్ ఒక గొప్ప దేశం అని కొనియాడారు. రష్యాతో భారతదేశం సహకరిస్తుండటంపై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలను తప్పుబడుతూ…న్యూఢిల్లీ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని ఆయన సమర్థించారు. ఇటువంటి చర్యలు ద్వైపాక్షిక మరియు అంతర్జాతీయ సంబంధాలకు “నష్టం” కలిగిస్తాయని ఆయన పేర్కొన్నారు.

సెయింట్ పీటర్స్‌బర్గ్ ఎకనామిక్ ఫోరమ్‌లో మీడియాతో మాట్లాడిన పుతిన్..భారతదేశం అన్ని దేశాలతో తన సంబంధాలను పెంపొందించుకుంటున్నందుకు మేము సంతోషిస్తున్నాము. ఇది ఒక గొప్ప దేశం అని అన్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మరియు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అయిన భారతదేశాన్ని ప్రశంసిస్తూ పుతిన్..భారతదేశం తన అవసరాలకు అనుగుణంగా, తనకు అవసరమని భావించే దేశాలతో తన ఆర్థిక వ్యవస్థను పెంపొందించుకోవడం చాలా సహజం అన్నారు.

ఆయన ఇంకా జోడిస్తూ, “ఉదాహరణకు, రష్యాతో సహకారం విషయంలో అమెరికా భారతదేశంపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. కానీ నరేంద్ర మోదీపై ఒత్తిడి తీసుకురావడం అంతర్జాతీయ సంబంధాలకు మరియు ద్వైపాక్షిక సంబంధాలకు నష్టదాయకం. ఈ ఒత్తిడి ఎక్కడి నుండి వస్తుందనేది ముఖ్యం కాదు” అని స్పష్టం చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశ ఆర్థిక వృద్ధి గురించి రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతూ, “ప్రపంచంలోనే అత్యధిక ఆర్థిక వృద్ధి రేట్లను ప్రదర్శిస్తున్న ప్రముఖ ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం ఒకటి. ఇది ఊరికే అయాచితంగా వచ్చింది కాదు. ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో ప్రభుత్వం చేస్తున్న కృషికి ఇది ఫలితం” అని అన్నారు.

Also Read:కొత్త రూల్ తీసుకొచ్చిన UPSC!

న్యూఢిల్లీ మరియు మాస్కోల మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. నేను ఈ సంబంధాన్ని ఆ విధంగానే వర్ణిస్తాను. ఇది నిన్ననో, మొన్ననో లేదా ఐదేళ్ల క్రితమో ఏర్పడింది కాదు. దీని కోసం మేము దశాబ్దాలుగా కృషి చేస్తున్నాము. 1947 లో సోవియట్ యూనియన్ భారత రిపబ్లిక్‌తో దౌత్య సంబంధాలను ఏర్పరచుకున్నప్పటి నుండి, ఒక కొత్త స్వతంత్ర దేశం ఏర్పాటుకు మద్దతు ఇవ్వడానికి మేము చేయగలిగినదంతా చేసాము. భారత ప్రజల కష్టపడే తత్వం మరియు వారి ప్రతిభ కారణంగానే భారతదేశం తన అభివృద్ధిలో గొప్ప మరియు ముఖ్యమైన విజయాలను సాధించిందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను అని రష్యా అధ్యక్షుడు పేర్కొన్నారు.

- Advertisement -