బీకే హరిప్రసాద్ పలు రాష్ట్రాల పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన హర్యానా ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు, ఈ బాధ్యత నుండి ఆయన త్వరలోనే తప్పుకోనున్నారు.
కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) నూతన అధ్యక్షుడిగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బీకే హరిప్రసాద్ నియమితులయ్యారు. డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా పదోన్నతి పొందడంతో హరిప్రసాద్ ఈ పదవికి ఎంపికయ్యారు.
హరిప్రసాద్ ప్రస్తుతం కర్ణాటక శాసనమండలి సభ్యుడిగా (MLC) ఉన్నారు.ఆయన పదవీ కాలం ఈ నెల చివర్లో ముగియనుంది. కాంగ్రెస్‌లో సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడైన ఆయన.. నరేంద్ర మోదీ ప్రభుత్వం, బీజేపీ, మరియు ఆర్‌ఎస్‌ఎస్ (RSS) లపై తీవ్రమైన విమర్శలు చేయడంలో ప్రసిద్ధి చెందారు.
హరిప్రసాద్ గతంలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. వివిధ రాష్ట్రాలకు కాంగ్రెస్ పార్టీ వ్యవహార బాధ్యతలను చూసుకున్నారు. ప్రస్తుతం ఆయన హర్యానా కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. కేపీసీసీ చీఫ్‌గా నియమితులు కావడంతో త్వరలోనే ఆయన ఈ బాధ్యత నుండి తప్పుకోనున్నారు.
జూలై 29, 1954న జన్మించిన హరిప్రసాద్… బిలవ (Billava) సామాజిక వర్గానికి చెందినవారు. కర్ణాటకలో ఈ సమాజం ఇతర వెనుకబడిన తరగతుల (OBC) జాబితా కిందకు వస్తుంది.
Also Read;ఓటర్ల జాబితా ‘వడపోత’పై అప్రమత్తం!

