కాంగ్రెస్‌కు విజయ్‌ మరో ఆఫర్

3
- Advertisement -

కాంగ్రెస్ పార్టీకి తమిళనాడు సీఎం విజయ్ మరో ఆఫర్ ఇచ్చారు. ఏఐఏడీఎంకే (AIADMK) సభ్యుడు సీవీ షణ్ముగం రాజీనామా చేయడంతో తమిళనాడుకు చెందిన ఒక రాజ్యసభ స్థానం ఖాళీ అయింది. దీనికి జూన్ 18న ఎన్నిక జరగనుంది. తమ కూటమి భాగస్వామి అయిన కాంగ్రెస్ పార్టీకి ఈ రాజ్యసభ స్థానాన్ని కేటాయించారు సీఎం విజయ్.

ముఖ్యమంత్రి విజయ్ ఒక ప్రకటన చేస్తూ…జూన్ 18న తమిళనాడులో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో, తమిళగ వెట్రి కజగం నేతృత్వంలోని కూటమి ఈ స్థానాన్ని తమ భాగస్వామి అయిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కు కేటాయించాలని నిర్ణయించింది అని తెలిపారు.

గతంలో రాష్ట్ర మంత్రిగా పనిచేసిన షణ్ముగం…ఏప్రిల్ 23న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మైలం శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన మే 7న తన రాజ్యసభ పదవికి రాజీనామా చేయడంతో ఈ ఉపఎన్నిక అనివార్యమైంది. తమిళనాడు శాసనసభ సెక్రటేరియట్ విడుదల చేసిన వివరాల ప్రకారం….తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేల ఓటింగ్ ద్వారా ఈ రాజ్యసభ స్థానాన్ని భర్తీ చేయడానికి ఎన్నికలు నిర్వహిస్తారు.

Also Read:ఓటర్ల జాబితా ‘వడపోత’పై అప్రమత్తం!

- Advertisement -