IMD:నైరుతి రాక అప్పుడే!

3
- Advertisement -

దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్న తరుణంలో భారత వాతావరణ శాఖ (IMD) గుడ్ న్యూస్ తెలిపింది. తావరణ శాఖ సమాచారం ప్రకారం…జూన్ 4 నాటికి రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉంది అని అలాగే రాబోయే 6 నుండి 7 రోజుల పాటు కేరళ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

దీనితో పాటు తమిళనాడు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. గత కొన్ని వారాలుగా కేరళలో నైరుతి రుతుపవనాల రాకపై ఐఎండీ తన అంచనాలను పలుమార్లు సవరించింది. మొదట మే 26 నాటికి రుతుపవనాలు వస్తాయని భావించారు. ఆ తర్వాత ఆ తేదీని మే 28కి.. ఆపై జూన్ 1కి మార్చారు. తమ తాజా అప్‌డేట్‌లో వాతావరణ కార్యాలయం జూన్ 3 కంటే ముందు కేరళకు రుతుపవనాలు వచ్చే అవకాశం లేదని పేర్కొంది.

మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల మరికొంత ఆలస్యం కావచ్చని, ఈ తేదీ ఇంకా మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. ఆలస్యమైనప్పటికీ…జూన్ 8 లోపు కేరళలో రుతుపవనాలు ప్రవేశించడం సాధారణ పరిధిలోనే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

వాతావరణ మరియు సముద్ర పరిస్థితులను బట్టి రుతుపవనాల రాక తేదీ ఏటా మారుతుంటుంది. ఒకసారి రుతుపవనాలు కేరళను తాకిన తర్వాత కొన్ని వారాల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా విస్తరిస్తాయి. సాధారణంగా, జూలై మొదటి వారం నాటికి రుతుపవనాలు భారతదేశంలోని చాలా ప్రాంతాలను కవర్ చేస్తాయి.

Also Read:ఇది రాచరికం కాదు..రబ్రీపై సీఎం!

- Advertisement -