కివీస్ టూర్‌కు టీమిండియా..షెడ్యూల్

3
- Advertisement -

న్యూజిలాండ్ క్రికెట్ తమ హోమ్ సీజన్ షెడ్యూల్‌ను ప్రకటించింది. ఇందులో పురుషుల, మహిళల జట్లకు సంబంధించి అంతర్జాతీయ మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ మొత్తం షెడ్యూల్‌లో అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య అన్ని ఫార్మాట్లలో సిరీస్ జరగనుంది.

ఐసీసీ సమాచారం ప్రకారం….ఈ పర్యటనలో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్లు 5 టీ20లు, 5 వన్డేలు , 2 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. మొత్తంగా 12 మ్యాచ్‌లు జరగనున్న ఈ సిరీస్, మ్యాచ్‌ల సంఖ్య పరంగా న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత పెద్ద హోమ్ సిరీస్‌గా నిలవనుంది. అంతేకాకుండా భారత పురుషుల జట్టు 2019 తర్వాత తొలిసారి టెస్ట్ క్రికెట్ కోసం లాగే 2022 తర్వాత తొలిసారి పరిమిత ఓవర్ల సిరీస్ కోసం న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టబోతోంది.

టీ20 సిరీస్‌.. అక్టోబర్ 22 నుండి నవంబర్ 1 వరకు మొత్తం 5 మ్యాచ్‌లు – క్రిస్ట్‌చర్చ్, వెల్లింగ్టన్, ఆక్లాండ్, హామిల్టన్ వేదికలుగా జరుగుతాయి. తర్వాత నవంబర్ 4 నుండి నవంబర్ 15 వరకు (మొత్తం 5 వన్డే మ్యాచ్‌లు – ఆక్లాండ్, వెల్లింగ్టన్, హామిల్టన్, మౌంట్ మాంగనుయ్ వేదికలు)గా జరగనున్నాయి. మొదటి టెస్ట్ నవంబర్ 19-23 (వెల్లింగ్టన్), రెండో టెస్ట్ నవంబర్ 27 – డిసెంబర్ 1 వరకు (క్రిస్ట్‌చర్చ్) జరగనున్నాయి.

భారత్ సిరీస్ ముగిసిన వెంటనే జనవరి 16 నుండి శ్రీలంక జట్టుతో న్యూజిలాండ్ హోమ్ సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ పర్యటనలో లంక జట్టుతో 3 వన్డేలు, 3 టీ20లు, 2 టెస్ట్ మ్యాచ్‌లు జరగనున్నాయి. న్యూజిలాండ్ మహిళల జట్టు…డిసెంబర్ 10 నుండి 23 వరకు బంగ్లాదేశ్‌తో స్వదేశంలో 3 టీ20లు, 3 వన్డేల సిరీస్ ఆడనుంది. మహిళల జట్టుకు ఈ వేసవిలో ఇదొక్కటే హోమ్ సిరీస్ కావడం గమనార్హం.

Also Read:ఇది రాచరికం కాదు..రబ్రీపై సీఎం!

- Advertisement -