బెర్హంపూర్ బరిలో అధీర్ రంజన్!

10
- Advertisement -

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. ఐదుసార్లు ఎంపీగా గెలిచిన అశీర్ రంజన్…తన పాత కోట బెర్హంపూర్‌లో ఈసారి అసెంబ్లీ స్థానం నుంచి ఆయన పోటీ చేస్తుండటం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ఇక్కడ ఆయన ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే సుబ్రతా మైత్రాతో అగ్నిపరీక్షను ఎదుర్కోబోతున్నారు.

అధీర్ రంజన్ చౌదరికి చావోరేవో పోరుగత లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) అభ్యర్థి యూసుఫ్ పఠాన్ చేతిలో ఓటమి పాలైన తర్వాత, అధీర్ రంజన్ తన ఉనికిని కాపాడుకోవడానికి రాష్ట్ర రాజకీయాల వైపు మళ్లారు. బెర్హంపూర్‌ను దశాబ్దాలుగా తన సామ్రాజ్యంగా మార్చుకున్న ఆయనకు, ఈ అసెంబ్లీ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి.

బెర్హంపూర్ మున్సిపాలిటీలో పట్టు కోల్పోకుండా ఉండటంతో పాటు, కాంగ్రెస్ ఉనికిని బెంగాల్‌లో చాటడం ఆయన ప్రధాన లక్ష్యం. బీజేపీకి చెందిన సుబ్రతా మైత్రా గత ఎన్నికల్లో ఇక్కడ బలమైన విజయాన్ని అందుకున్నారు. స్థానికంగా మైత్రాకు ఉన్న ఆదరణ, మోదీ క్రేజ్ ఇప్పుడు అధీర్‌కు సవాలుగా మారాయి.

కేవలం బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే కాకుండా తృణమూల్ కాంగ్రెస్ కూడా ఇక్కడ గట్టి పోటీని ఇస్తోంది. ముర్షిదాబాద్ జిల్లాలో ఒకప్పుడు కాంగ్రెస్‌కు ఉన్న తిరుగులేని ఆధిపత్యాన్ని టీఎంసీ క్రమంగా దెబ్బతీస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో అధీర్ రంజన్ చౌదరి తన పాత వర్గాలను, కార్యకర్తలను తిరిగి ఏకం చేయగలరా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

Also Read:వరుణ్ తేజ్..’కొరియన్ కనకరాజు’!

- Advertisement -