రోజూ ఫుల్ బాటిల్‌ తాగేవాడిని!

8
- Advertisement -

బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ తన వ్యక్తిగత జీవితంపై సంచలన విషయాలు వెల్లడించారు. గతంలో ఎదుర్కొన్న కష్టకాలం, మద్యానికి బానిసైన పరిస్థితి గురించి ఆయన తాజాగా ఓ టాక్ షోలో ఓపెన్ అయ్యారు.

తన మొదటి భార్య రీనా దత్తతో విడాకులు తీసుకున్న తర్వాత తీవ్ర మనోవేదనకు గురయ్యానని అమీర్ చెప్పారు. ఆ సమయంలో జీవితంలో ఖాళీగా అనిపించిందని, ఆ బాధ నుంచి బయటపడలేక మద్యం వైపు వెళ్లానని వెల్లడించారు. “దాదాపు ఏడాదిన్నర పాటు రోజూ ఫుల్ బాటిల్ తాగేవాడిని” అంటూ తన గతాన్ని గుర్తుచేసుకున్నారు.

ఈ విషయాలను ఆయన ‘Duologue with Barun Das’ అనే టాక్ షోలో వెల్లడించారు. తన జీవితంలో ఎదురైన కష్టాలు, తీసుకున్న నిర్ణయాలు, వాటి ప్రభావం గురించి ఆయన స్పష్టంగా మాట్లాడారు.

1986లో రీనా దత్తను వివాహం చేసుకున్నారు అమీర్. 2002లో విడాకులు తీసుకోగా 2005లో కిరణ్ రావును వివాహం చేసుకున్నారు. 2021లో రెండో విడాకులు తీసుకోగా
ఈ ప్రయాణంలో అనేక భావోద్వేగ పరిస్థితులు ఎదుర్కొన్నట్లు అమీర్ తెలిపారు.

ఇటీవల తన 60వ పుట్టినరోజు సందర్భంగా అమీర్ తన కొత్త గర్ల్‌ఫ్రెండ్ Gauri Sprattను పరిచయం చేశారు.ఇప్పుడతను గతాన్ని వెనక్కి వదిలి, కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నట్లు కనిపిస్తున్నారు.తన అనుభవం ద్వారా అమీర్ ఒక ముఖ్యమైన సందేశం ఇచ్చారు.మనోవేదనలో తీసుకునే తప్పు నిర్ణయాలు జీవితాన్ని మరింత కష్టాల్లోకి నెడతాయని చెప్పారు.

Also Read:KTR:జీవన్ రెడ్డికి తగిన ప్రాధాన్యం కల్పిస్తాం

- Advertisement -