మంచిర్యాలకు కేటీఆర్

6
- Advertisement -

ఈ నెల 12వ తేదీన మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సందర్భంగా జిల్లా స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశంలో ఉదయం 11 గంటలకు జిల్లా పార్టీ కార్యాలయంలో పాల్గొననున్నారు.

ఈ పర్యటనకు సంబంధించి జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ … కేటీఆర్ ని కలసి ఆహ్వానించారు. జిల్లా పర్యటనలో భాగంగా ఎన్నో ఒడిదుడుకులు, బెదిరింపులు, ప్రలోభాలకు లొంగకుండా పార్టీకి కట్టుబడి ఉన్న క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్, సభ్యులను కేటీఆర్ సన్మానించనున్నారు.

మధ్యాహ్నం 12:30 భాగంగా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కుమార్తె వివాహ వేడుకకు కూడా కేటీఆర్ హాజరుకానున్నారు. వివాహ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1:30 నిమిషాలకు క్యాతనపల్లి లోని బాల్క సుమన్ నివాసంలో కేటీఆర్ మీడియాతో సమావేశం కానున్నారు. అదే సమయంలో పలు సంఘాల నాయకులను కేటీఆర్ కలవనున్నారు.

ALso Read:రోజూ ఫుల్ బాటిల్‌ తాగేవాడిని!

- Advertisement -