13 ఏళ్ల లోపు పిల్లలకు.. సోషల్‌ మీడియా నిషేధం

7
- Advertisement -

పిల్లల భద్రత, మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సోషల్ మీడియా వినియోగంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్…13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా దూరంగా ఉంచాలని స్పష్టం చేశారు.

పిల్లలు చిన్న వయసులోనే సోషల్ మీడియాకు అలవాటు పడటం వల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఈ చట్టం ద్వారా పిల్లలపై పడుతున్న డిజిటల్ ప్రభావాన్ని తగ్గించడం, వారి భవిష్యత్తును రక్షించడం లక్ష్యంగా ఉందని తెలిపారు.చట్ట రూపకల్పనలో భాగంగా, మంత్రుల బృందం ప్రముఖ టెక్ సంస్థలతో సమావేశమైంది. ఇందులో మెటా ఫ్లాట్‌ఫామ్స్ మరియు యూ ట్యూబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.

పిల్లల వయస్సును ధృవీకరించే విధానాలు, కంటెంట్ నియంత్రణ, భద్రతా ప్రమాణాలపై చర్చలు జరిగాయి. టెక్ కంపెనీల సహకారంతో సమర్థవంతమైన విధానాన్ని రూపొందించాలనే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

సోషల్ మీడియాలో పెరుగుతున్న విద్వేష వ్యాఖ్యలపై కూడా మంత్రి లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు.సోషల్ మీడియాలో ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవుఅని హెచ్చరించారు.ఇలాంటి వ్యాఖ్యలు సమాజంలో ఉద్రిక్తతలు పెంచుతున్నాయని, వాటిని అరికట్టడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు.

Also Read:KTR:జీవన్ రెడ్డికి తగిన ప్రాధాన్యం కల్పిస్తాం

- Advertisement -