ఈసీతో టీఎంసీ ప్రతినిధుల భేటీ!

5
- Advertisement -

బుధవారం జరిగిన తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రతినిధుల బృందం మరియు భారత ఎన్నికల సంఘం మధ్య సమావేశం ఉద్రిక్తంగా మారింది. టీఎంసీ నేత ఓబ్రెయెన్‌ .. సీఈసీపై పలు ఆరోపణలు చేయడంతో సమావేశంలో వాగ్వాదం చోటు చేసుకుంది.

టీఎంసీ ప్రతినిధులు, ఎన్నికల సంఘం తమ పలుమార్లు పంపిన లేఖలకు స్పందించలేదని ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన తొమ్మిది లేఖలు, ఆరు ఉదాహరణలు ఇచ్చినా ఎటువంటి స్పందన రాలేదని పేర్కొన్నారు.

మేము ఈ అంశాలపై చర్చించడానికి వెళ్లాం. కానీ ఎటువంటి స్పందన ఇవ్వలేదు అని టీఎంసీ నేతలు ఆరోపించినట్లు సమాచారం. డెరెక్ ఓ బ్రియన్ మాట్లాడుతూ..సమావేశం ప్రారంభమైన 7 నిమిషాల్లోనే సీఈసీ ‘Get Lost’ అన్నారు. మేము పార్లమెంట్‌లో రెండో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ అని వ్యాఖ్యానించినట్లు తెలిసింది.

సమావేశం కేవలం 7 నిమిషాల్లోనే ముగిసినట్లు సమాచారం. అధికారులే ప్రతినిధులను వెళ్లిపోవాలని సూచించినట్లు వర్గాలు తెలిపాయి. ఈ వ్యవహారాన్ని టీఎంసీ నేతలు తీవ్రంగా ఖండిస్తూ, ఇది సంస్థ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉందని వ్యాఖ్యానించారు.ఈ సంఘటన మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఎందుకంటే ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించాలని కోరుతూ పార్లమెంట్ రెండు సభల్లోనూ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం.

ఈ విషయంపై త్వరలోనే ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని తెలిపారు.

Also Read:ఆల్కహాల్ టూ కాఫీ..గట్ హెల్త్‌కు హాని చేసేది ఏది?

- Advertisement -