IPL:విదేశీ ఆటగాళ్లపై గవాస్కర్!

5
- Advertisement -

భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్… ఐపీఎల్ 2026 సీజన్‌లో విదేశీ ఆటగాళ్ల అందుబాటుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పలువురు విదేశీ ఆటగాళ్లు వివిధ కారణాలతో తమ జట్లకు చేరకపోవడం, లేదా పూర్తి ఫిట్‌గా లేకపోవడం ఆయన విమర్శలకు కారణమైంది.

ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు మిచెల్ స్టార్క్ గాయంతో కోలుకుంటుండగా క్రికెట్ ఆస్ట్రేలియా అతని పనిభారాన్ని నియంత్రిస్తోంది. అలాగే పాట్ కమిన్స్, హాజల్‌వుడ్ జట్లకు చేరినా ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదు.

ఇంకా, శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా తమ ఆటగాళ్లకు NoC ఇవ్వకుండా ఉండటం ఫ్రాంచైజీలకు ఇబ్బందిగా మారింది. హసరంగా, మతీషా పతిరన గాయాల కారణంగా జట్లకు చేరలేదు. ఈషాన్ మలింగ ఈ విషయంపై కోర్టుకూ వెళ్లినట్లు సమాచారం.

అత్యంత పెద్ద వివాదం క్యామరెన్ గ్రీన్ చుట్టూ నెలకొంది. కేకేఈఆర్ రూ.25.2 కోట్లకు కొనుగోలు చేసిన గ్రీన్, ఆల్‌రౌండర్‌గా ఆడతానని చెప్పినప్పటికీ, క్రికెట్ ఆస్ట్రేలియా అతన్ని కేవలం బ్యాట్స్‌మన్‌గా మాత్రమే ఆడమని సూచించింది. ఈ అంశంపై కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే కూడా విమర్శలు చేశారు. అయితే, క్రికెట్ ఆస్ట్రేలియా ముందుగానే సమాచారం ఇచ్చామని తెలిపింది.

గవాస్కర్ మాట్లాడుతూ… “దేశానికి ఆడటం ముఖ్యమే అయినా, ఫ్రాంచైజీలు కూడా ఆటగాళ్లపై భారీగా ఖర్చు చేస్తాయి. అలాంటప్పుడు పూర్తి నిబద్ధత చూపాలి అన్నారు. ఒక బౌలర్ మ్యాచ్‌లో కేవలం 4 ఓవర్లు మాత్రమే వేస్తాడు. మొత్తం 14 లీగ్ మ్యాచ్‌లలో 56 ఓవర్లు మాత్రమే అవుతాయి. ఇంత తక్కువ లోడ్ కూడా భరించలేకపోతే, వారు ఇంకా విశ్రాంతి తీసుకోవడం మంచిది అని వ్యాఖ్యానించారు.

Also Read:ఆల్కహాల్ టూ కాఫీ..గట్ హెల్త్‌కు హాని చేసేది ఏది?

విదేశీ ఆటగాళ్లకు మాత్రమే కాకుండా, వారి దేశ క్రికెట్ బోర్డులకు కూడా ఐపీఎల్ ద్వారా లాభం వస్తోందని గవాస్కర్ గుర్తుచేశారు. ఆటగాళ్ల జీతంలో 10% వరకు వారి బోర్డులకు అందుతుందని తెలిపారు. ప్రపంచంలోని ఇతర T20 లీగ్‌లలో ఇలాంటి విధానం లేదని, అయినప్పటికీ ఐపీఎల్‌ను “క్యాష్ కౌ”గా ఉపయోగించుకుంటున్నారని గవాస్కర్ వ్యాఖ్యానించారు.

- Advertisement -