ఒకరి బర్త్‌డే.. మరొకరికి పునర్జన్మ!

6
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుటుంబంలో ఈ రోజు భావోద్వేగాలతో నిండిన ప్రత్యేక దినంగా మారింది. ఆయన భార్య అన్నా లెజెనోవా సోషల్ మీడియాలో చేసిన పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఈ రోజు తమ కుటుంబానికి ఎంతో ముఖ్యమైన రోజని అన్నా లెజినోవా తెలిపారు. ఈ రోజును ఎప్పటికీ మర్చిపోలేం. ఎందుకంటే నేడు మా కుమారుడు అఖిరా నందన్‌ పుట్టినరోజు” అని ఆమె పేర్కొన్నారు.

అయితే ఇదే రోజు మరో కారణంతో కూడా ప్రత్యేకమైందని వెల్లడించారు. సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదం నుంచి తమ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడిన రోజుగా కూడా ఇదే తేదీ నిలిచిపోయిందని చెప్పారు. “మార్క్‌కు ఇది నిజంగా పునర్జన్మ లాంటిది” అని ఆమె భావోద్వేగంతో తెలిపారు.

అందుకే ఈ రోజు మా ఇద్దరు అబ్బాయిల విషయంలో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఒకరికి పుట్టినరోజు, మరొకరికి కొత్త జీవితం లభించిన రోజు అని ఆమె పేర్కొన్నారు. అలాగే, ఆ అగ్ని ప్రమాద సమయంలో మార్క్‌తో పాటు మరో 15 మంది పిల్లలను రక్షించిన కార్మికులను ఆమె ప్రశంసించారు. “వాళ్లు నిజమైన హీరోలు” అంటూ వారికి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -