భారతదేశంలోని నగరాల్లో యువ ఉద్యోగులు తెలియకుండానే బరువు పెరుగుతున్న సమస్య పెరుగుతోంది. పని ఒత్తిడి, అసమయ భోజనం, నిద్రలేమి, కూర్చునే జీవనశైలి అన్ని కలిపి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఎక్కువ పని గంటలు,నిరంతరం ఫోన్, ల్యాప్‌టాప్ వినియోగం, విశ్రాంతి లేకపోవడం.దీంతో కెరీర్ పెరుగుతున్నా, ఆరోగ్యం మాత్రం వెనుకబడుతోంది.
బరువు పెరగడానికి కేవలం ఆహారం మాత్రమే కారణం కాదు, జీవనశైలి కూడా కీలకం.బ్రేక్‌ఫాస్ట్ మానేయడం,ఆఫీస్‌లో త్వరగా లంచ్ చేయడం,రాత్రి ఆలస్యంగా డిన్నర్,మధ్యలో టీ, కాఫీ, జంక్ ఫుడ్. శరీరానికి శక్తి వస్తోంది కానీ దాన్ని ఖర్చు చేసే అవకాశం ఉండడం లేదు.
రోజుకు 8–10 గంటలు కూర్చోవడం ఇప్పుడు సాధారణం.మెటాబాలిజం నెమ్మదిస్తుంది,కాలరీలు కొవ్వుగా నిల్వవుతాయి,ముఖ్యంగా పొట్ట చుట్టూ ఫ్యాట్ పెరుగుతుంది. నిద్రలేమి ప్రభావం,రాత్రి ఆలస్యంగా పని,ఎక్కువ స్క్రీన్ టైమ్,ఇవి నిద్రను తగ్గిస్తాయి.
ఆకలి హార్మోన్లు మారిపోతాయి.ఎక్కువ కాలరీల ఆహారం తినాలని అనిపిస్తుంది.ఎనర్జీ తగ్గిపోతుంది. ఒత్తిడి కూడా కారణమే.పని ఒత్తిడి వల్ల కార్టిసోల్ అనే హార్మోన్ పెరుగుతుంది. దీంతో శరీరంలో కొవ్వు నిల్వ పెరుగుతుంది.మహిళల్లో ఒవ్యూలేషన్ సమస్యలు.పురుషుల్లో టెస్టోస్టెరాన్ తగ్గుదల కారణం అవుతుంది.
Also Read:వీళ్ల పాలన చూస్తుంటే బీపీ లేస్తుంది!
ఈ సమస్యలను తగ్గించడానికి సమయానికి భోజనం,రోజూ కొంత వ్యాయామం,కనీసం 7 గంటల నిద్ర,క్రాష్ డైట్స్ అవసరం లేదు. కెరీర్ పెరుగుతుంటే శరీరం వృద్ధాప్యం చెందుతోంది.20s, 30s లో ఆరోగ్యాన్ని పట్టించుకుంటే, భవిష్యత్తులో వచ్చే వ్యాధులను నివారించవచ్చు.

