ఇది ప్రజాపాలన కాదు…నిరంకుశ పాలన:BRSV

10
- Advertisement -

ఇది ప్రజాపాలన కాదు నిరంకుశ పాలన అని మండిపడ్డారు బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి నాగారం ప్రశాంత్. ట్యాంక్‌బండ్ వద్ద నిరసన కార్యక్రమంలో మాట్లాడిన ప్రశాంత్.. తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్నది ప్రజాపాలన కాదని, అది ముమ్మాటికీ నిరంకుశ మరియు దుర్మార్గ పాలన అని BRSV తీవ్రంగా ఆక్షేపిస్తోంది..బలహీన వర్గాల ఆత్మగౌరవ ప్రతీక, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి విగ్రహానికి తాళాలు వేయడం కాంగ్రెస్ ప్రభుత్వ దిగజారుడుతనానికి స్పష్టమైన నిదర్శనం అన్నారు.

ఆనాడు అంబేద్కర్ గారిని పార్లమెంట్‌కు వెళ్లకుండా అడ్డుకున్న చరిత్ర కాంగ్రెస్‌ది. ఈనాడు ఆయన విగ్రహం వద్దకు ప్రజలు వెళ్లకుండా తాళాలు వేసి అడ్డుకుంటున్న చరిత్ర కూడా అదే కాంగ్రెస్‌దే.కాంగ్రెస్ పార్టీ DNA లోనే ఉంది అంబేద్కర్ గారి మీద వ్యతిరేకత …ఈ ఘటనతో కాంగ్రెస్ వైఖరిలో దళితుల పట్ల నిర్లక్ష్యం, అంబేద్కర్ గారి ఆలోచనల పట్ల వ్యతిరేకత స్పష్టంగా బయటపడుతోంది అన్నారు.

నాడు గౌరవనీయ కేసీఆర్ …అంబేద్కర్ గారిపై ఉన్న అపార గౌరవంతో ప్రపంచంలోనే అరుదైన విధంగా 125 అడుగుల భారీ విగ్రహాన్ని నిర్మించి జాతికి అంకితం చేశారు.కానీ నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ విగ్రహానికి తాళాలు వేయించడం ద్వారా అంబేద్కరిస్టులను అవమానిస్తున్నారు అన్నారు.

BRSV డిమాండ్లు

ముఖ్యమంత్రి గారు గుర్తుంచుకోండి —అంబేద్కర్ గారు లేకపోతే ఈ దేశంలో సమానత్వం లేదు, ప్రజాస్వామ్యమే లేదు.

👉 రాబోయే ఏప్రిల్ 14 (అంబేద్కర్ జయంతి) లోపు విగ్రహాన్ని పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి.
👉 లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, ప్రజలతో కలిసి BRSV ఆధ్వర్యంలో గేట్లకు ఉన్న తాళాలు బద్దలు కొడుతాం అని హెచ్చరిస్తున్నాం.
ఖబర్దార్ రేవంత్ రెడ్డి.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాజీ స్పోర్ట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి గారు,స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షుడు రాజేష్, మరియు వినోద్, నాగరాజు గౌడ్,ప్రభు కిరణ్, అనిల్, అన్వేష్, అరుణ్,ఆనంద్, సంతోష్,భాను గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -