Fact Check..ఆన్‌లైన్ చెల్లింపుల్లో మార్పులు?

7
- Advertisement -

ఇటీవల సోషల్ మీడియాలో ఒక సందేశం వైరల్ అవుతోంది. ఏప్రిల్ 1, 2026 నుంచి భారతదేశంలో ఆన్‌లైన్ చెల్లింపుల విధానంలో భారీ మార్పులు వస్తాయని అందులో పేర్కొంటున్నారు. కొత్త భద్రతా విధానాలు, OTP మార్పులు, బయోమెట్రిక్ ధృవీకరణ వంటి అంశాలు తప్పనిసరి అవుతాయని చెబుతున్నారు.

అయితే, ఈ సమాచారంపై నమ్మకం ఉంచే ముందు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి.ఆర్బీఐ,నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఇలాంటి మార్పులపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మెస్సేజ్ ప్రకారం.. అన్ని ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్‌ కొత్త భద్రతా ప్రమాణాలతో జరుగుతాయని చెబుతోంది. నిజానికి బ్యాంకులు ఇప్పటికే భద్రతను పెంచుతున్నాయి కానీ దేశవ్యాప్తంగా ఒకే విధానం అమలు చేయాలని ఎలాంటి అధికారిక నిర్ణయం లేదు.

లొకేషన్, వినియోగపు అలవాట్ల ఆధారంగా ప్రతి లావాదేవీని చెక్ చేస్తారని అంటున్నారు. కొన్ని బ్యాంకులు ఇప్పటికే ఫ్రాడ్ గుర్తించే టెక్నాలజీని వాడుతున్నా, ఇది తప్పనిసరి నియమం కాదు.

కొన్ని యాప్‌లు భద్రత కోసం స్క్రీన్‌షాట్లను నిరోధిస్తున్నాయి. కానీ అన్ని బ్యాంకింగ్ యాప్‌లకు ఇది తప్పనిసరి అని ఎక్కడా చెప్పలేదు.

SMS OTPలు పూర్తిగా రద్దు అవుతాయని ప్రచారం జరుగుతోంది. కానీ వాస్తవానికి SMS OTPలు ఇప్పటికీ విస్తృతంగా ఉపయోగంలో ఉన్నాయి. యాప్ ఆధారిత ఆథెంటికేషన్ పెరుగుతున్నా, పాత విధానం కొనసాగుతోంది.

కొన్ని బ్యాంకులు “నైట్ ట్రాన్సాక్షన్ లాక్” వంటి ఫీచర్లు ఇస్తున్నాయి. కానీ ఇది వినియోగదారుడి ఎంపిక మాత్రమే, అందరికీ తప్పనిసరి కాదు.

యూజర్ టైపింగ్ స్టైల్ లేదా ఫోన్ వాడకం ఆధారంగా అదనపు ధృవీకరణ చేస్తారని అంటున్నారు. కొన్ని బ్యాంకులు దీనిని పరిశీలిస్తున్నా, ఇది దేశవ్యాప్తంగా అమలు అయ్యే నియమం కాదు.

పెద్ద మొత్తాల చెల్లింపులకు ఫింగర్‌ప్రింట్ లేదా ఫేస్ స్కాన్ తప్పనిసరి అవుతుందని వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటివరకు అలాంటి నియమం అమలులో లేదు.

Also Read:కర్ణాటకలో నీటి కొరత ముప్పు!

వినియోగదారులు ఏమి చేయాలి?

సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సందేశాన్ని నమ్మకండి
మీ బ్యాంక్ లేదా అధికారిక సంస్థల సమాచారం మాత్రమే విశ్వసించండి
OTPలు, పర్సనల్ వివరాలు ఎవరితోనూ పంచుకోకండి
అధికారిక యాప్‌లు మాత్రమే ఉపయోగించండి

ఏప్రిల్ 1, 2026 నుంచి ఆన్‌లైన్ చెల్లింపులపై భారీ మార్పులు వస్తున్నాయన్న వార్తల్లో ఎక్కువ భాగం వదంతులే. భద్రతా విధానాలు అభివృద్ధి చెందుతున్నప్పటికీ, అన్ని మార్పులు ఒకేసారి అమలు అవుతాయని ఎలాంటి అధికారిక నిర్ధారణ లేదు. కాబట్టి వినియోగదారులు జాగ్రత్తగా ఉండి, ధృవీకరించిన సమాచారాన్ని మాత్రమే నమ్మాలి.

- Advertisement -